Idream media
Idream media
ఉత్తరప్రదేశ్‌లో భారీ బంగారు గని బయటపడింది. 2005 నుంచి జీయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సాగించిన సుదీర్ఘ అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా సోన్‌పహడిలో 3000 మెట్రిక్ టన్నుల ( 30 లక్షల కిలోలు) బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంతోపాటు ఇదే జిల్లా హర్తి ప్రాంతంలో మరో 650 మెట్రిక్ టన్నుల ( 6.5 లక్షల కిలోలు) బంగారు ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ గనుల్లో బంగారంతోపాటుగా ఉక్కు, పొటాషియం తదితర విలువైన నిక్షేపాలు కూడా ఉన్నట్లు జీఎస్ఐ చెబుతోంది. ఈ గనులపై సమగ్ర నివేదిక అందించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గనులపై సమగ్ర నివేదిక అందించనుంది. ఆ తర్వాత సదరు వివరాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లనున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బంగారు గనుల వేలానికి సంబంధించిన చర్యలు చేపట్టనుంది. వీటిని వెలికితీసే కాంట్రాక్ట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. ఈ గనులలోని నిక్షేపాల విలువ 12 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.