iDreamPost
android-app
ios-app

ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది దుర్మరణం

  • Published Jan 25, 2024 | 10:38 AM Updated Updated Jan 25, 2024 | 10:38 AM

ఇటీవల పెద్ద పెద్ద కట్టడాలు, డ్యాముల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో భద్రతా లేని కారణంగా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

ఇటీవల పెద్ద పెద్ద కట్టడాలు, డ్యాముల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో భద్రతా లేని కారణంగా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

  • Published Jan 25, 2024 | 10:38 AMUpdated Jan 25, 2024 | 10:38 AM
ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది దుర్మరణం

మనిషికి ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, కరెంటె షాక్, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు కంటికి కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. కారణాలు ఏవైనా తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నిండుకుంటున్నాయి. ఎంతోమంది అనాధలుగా మిగిలిపోతున్నారు. ఇటీవల భవన నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో సైతం ప్రమాదాలు జరిగి పలువురు చనిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారు గని కూలి పలువురు మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయ పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ బంగారు గని కూలి 70 మందికి పైగా దుర్మరణంపాలయ్యారు.  ప్రస్తుతం గనిలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గని ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉన్నారని వెల్లడించారు. మాలిలోని నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో ఇటీవల బంగారు గని తవ్వకాలు జరుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారి కరీమ్ బార్తే తెలిపారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే జరిగినట్లు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

70 people died in the gold mine!

ఇక బంగారు గని కుప్పకూలిపోయిన సమయానికి 150 నుంచి 100 మంది వరకు ఉండగా.. అందులో 70 మంది చనిపోయారని.. మిగిలిన వారు గనిలో చిక్కుకోగా వారిని రెస్క్యూ టీమ్ రక్షించేందుకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాలేదని అన్నారు. ఆఫ్రికాలో మూడోవ అతిపెద్ద బంగారు ఉత్పత్తి దేశం మాలీ. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా బంగారు గనులు తవ్వకాలు జరిపే సమయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తరుచూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు భద్రతా చర్యలను విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇక నుంచి భద్రత విషయాల్లో గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.