iDreamPost
android-app
ios-app

ఉత్తరప్రదేశ్‌లో భారీ బంగారు గని

ఉత్తరప్రదేశ్‌లో భారీ బంగారు గని

ఉత్తరప్రదేశ్‌లో భారీ బంగారు గని బయటపడింది. 2005 నుంచి జీయోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సాగించిన సుదీర్ఘ అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా సోన్‌పహడిలో 3000 మెట్రిక్‌ టన్నుల ( 30 లక్షల కిలోలు) బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్‌ఐ సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంతోపాటు ఇదే జిల్లా హర్తి ప్రాంతంలో మరో 650 మెట్రిక్‌ టన్నుల ( 6.5 లక్షల కిలోలు) బంగారు ఉన్నట్లు కనుగొన్నారు.

ఈ గనుల్లో బంగారంతోపాటుగా ఉక్కు, పొటాషియం తదితర విలువైన నిక్షేపాలు కూడా ఉన్నట్లు జీఎస్‌ఐ చెబుతోంది. ఈ గనులపై సమగ్ర నివేదిక అందించేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గనులపై సమగ్ర నివేదిక అందించనుంది. ఆ తర్వాత సదరు వివరాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లనున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బంగారు గనుల వేలానికి సంబంధించిన చర్యలు చేపట్టనుంది. వీటిని వెలికితీసే కాంట్రాక్ట్‌ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.  ఈ గనులలోని నిక్షేపాల విలువ 12 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.