iDreamPost
android-app
ios-app

వీడియో: లిఫ్ట్‌లో చిక్కుకున్న చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన!

వీడియో: లిఫ్ట్‌లో చిక్కుకున్న చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన!

నేటికాలంలో పట్టణాలు, నగరాల్లో అపార్ట్ మెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక అపార్ట్ మెంట్లలో నివాసం ఉండే వారి సౌకర్యం కోసం.. నిర్వాహకులు లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొన్ని అపార్ట్ మెంట్లలో లిఫ్ట్ ల నిర్వహణ కొరవడుతుంది. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే లిఫ్ట్ ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం జరిగాయి. ఎంతో మంది తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా లిఫ్ట్ ప్రమాదాలకు సంభందించిన ఘటనలు అనేక సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కుని..20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ లోని కుర్సీ రోడ్ లో జానేశ్వర్ ఎన్ క్లేవ్ ఉంది. ఈ అపార్ట్మెంట్ సముదాయంలో ఓ చిన్నారి.. తన కుటుంబంతో నివాసం ఉంటుంది.  బుధవారం మధ్యాహ్నం ఆ బాలిక లిఫ్ట్ ఎక్కింది.  ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో అందులో  ఒంటరిగా ఉన్న ఆ బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. కాపాడండి అంటూ  గట్టిగా కేకలు వేస్తూ  లిఫ్ట్ డోర్ ను కొట్టింది. ధైర్యం తెచ్చుకుని తనవంతు  ఆ తలుపు తెరవడానికి ఆ చిన్నారి తీవ్రంగా శ్రమించింది. అయిన రాకపోయేసరికి మరింత గట్టిగా అరవడం మొదలు పెట్టింది. తనను ఎవరైన రక్షించాలని ఆ చిన్నారి కెమెరా వైపు చూసి ప్రాధేయపడింది. ఆ సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

లిఫ్ట్ లో చిక్కుకున్న సమయంలో ఆ చిన్నారి స్కూల్ డ్రెస్ లో  కన్పిస్తోంది.  ఇక అందులో నుంచి బయట పడే మార్గం కనిపించగా, ఎవరు తన మాటలకు స్పందించక పోవడంతో ఆ చిన్నారి తీవ్ర భయాందోళనకు గురైంది.  అలా దాదాపు 20 నిమిషాల పాటు లిఫ్ట్ లో ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. చివరకు అపార్ట్ మెంట్ వాసులు బాలిక లిఫ్ట్ లో ఇరుక్కుపోయినట్లు గుర్తించి.. చివరకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చిట్లు తెలుస్తోంది. అయితే ఆ చిన్నారి లిఫ్ట్ లో పెట్టిన ఆర్తనాదాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అపార్ట్ మెంట్ నిర్వహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనలో తప్పు ఎవరిది?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.