iDreamPost
android-app
ios-app

Hyderabad- హైదరాబాద్ లో దారుణం: ప్రేమించలేదని పట్టపగలు 18 కత్తి పోట్లు, అసలు ఏం జరిగింది…?

Hyderabad- హైదరాబాద్ లో దారుణం: ప్రేమించలేదని పట్టపగలు 18 కత్తి పోట్లు, అసలు ఏం జరిగింది…?

చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నా, ఏళ్ళ తరబడి కారాగారాల్లో మగ్గుతున్నా, కాల్చి చంపుతున్నా సరే సమాజం వెలివేస్తున్నా సరే ఆడాళ్ళ మీద దాడులు, ప్రేమ హత్యలు, ప్రేమ దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రేమించిన వాళ్ళు తమ సొంతం అవ్వాలని, తమను మినహా ఎవరిని పెళ్లి చేసుకోవద్దని పట్టుదలగా వ్యవహరిస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాలు. తాజాగా హైదరాబాద్ లో ఒక ఘటన సంచలనం సృష్టించింది. ఒక యువతి పెళ్లి చేసుకోవడం లేదనే కారణంతో ఒక యువకుడు దాడికి పాల్పడ్డాడు.

ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. శిరీష అనే యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. హస్తినపురం లోని యువతి ఇంట్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కత్తితో దాడికి దిగాడు. ప్రేమించి పెండ్లికి నిరాకరించిందన్న కోపంతో దాడికి పాల్పడ్డ బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు నవీన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై బాధితురాలు శిరీష మీడియాతో మాట్లాడింది. గతంలో మేము ఇద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పింది. నాకు ఆల్రెడీ వేరే వ్యక్తి తో ఎంగెజ్మెంట్ అయ్యింది.. ఇంట్లో ఒప్పోకోరు అని చెప్పాను అని చెప్పిన ఆమె… నాకు ఫోన్ చేయవద్దని బస్వరాజు కు చెప్పాను అని తెలిపింది. ఫోన్ చేయకపోతే చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను చాకు తో పొడిచాడు అని నన్ను పొడిచేటప్పుడు ఎవరూ కూడా ఆపలేదు అన్నారు ఆమె. వేరే వివాహం చేసుకుంటున్నాను అని బస్వరాజు నా పై దాడి చేశాడని మీడియాకు చెప్పారు.

Also Read : Lakhimpur Kheri – కేంద్రమంత్రి కుమారుడి తుపాకీతోనే కాల్పులు

వికారాబాద్ దౌల్తాబాద్ మండలం లోని చందపెట్ లో నివాసం ఉండే యువతి… అదే మండలంలో ఉండే బస్వరాజ్ తో ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇరువురి ప్రేమ వ్యవహారం శిరీష ఇంట్లో తెలియడంతో వీరి వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో శిరీష ని హైదరాబాద్ కి పంపించారు. హైదరాబాద్ వనస్థలిపురం లో ఓ వసతి గృహం లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది ఆమె. ఈ విషయాన్ని తెలుసుకుని హైదరాబాద్ మకాం మార్చిన బస్వరాజ్… ఆమెను మర్చిపోలేదు. ఇక కుటుంబ సభ్యులు మాట విని శ్రీరామ్ అనే అబ్బాయితో కొద్ది రోజుల క్రితం ఆమె నిశ్చితార్థం చేసుకుంది.

ఇక ఆ విషయం తెలుసుకుని అక్కడి నుంచి ఆమెకు ఫోన్ లు చేసాడు. ఇంట్లో ఒప్పుకోరు నాకు ఫోన్ చేయకని ఆమె చెప్పినా సరే అతను వినలేదని తెలుస్తుంది. తనతో మాట్లాడకుంటే చంపేస్తా అంటూ ఆమెను బెదిరించాడు. ఈరోజు సాయంత్రం యూసఫ్ గూడ నుండి తన హాస్టల్ కు వస్తున్న శిరీష మీద అతను దాడికి పాల్పడ్డాడు. పకడ్బందీగా ఫాలో అయ్యి తనతో తెచ్చుకున్న కత్తి తో అతను దాడి చేసాడు. ఇక నవీన ఆస్పత్రి డాక్టర్ రణదీర్ రెడ్డి ఆమె ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు. కత్తిపోట్లకు గురైన యువతి పరిస్థితి 24గంటలు గడిస్తే తప్ప చెప్పలేమన్నారు. ఆమె లంగ్స్,అబ్డామిన్ లో బలమైన గాయాలు అయ్యాయి అని స్కానింగ్ రిపోర్ట్ లు వస్తే ఆమెకు సర్జరీ కూడా చేయాలా లేదా అనే విషయం తెలుస్తుంది అని పేర్కొన్నారు. ఆమె ఒంటిపై మొత్తం 18 కత్తి పోట్లు ఉన్నాయి అన్నారు. ప్రస్తుతం ఐసియు లో పెట్టి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు.

Also Read : JC Prabhakar Reddy, Accident – జేసీ కాన్వాయ్‌కి ప్రమాదం.. జేసీ సేఫ్‌ కానీ..