iDreamPost
android-app
ios-app

ఇవే కొత్త జిల్లాలు : గజిట్ విడుదల,గ‌వ‌ర్న‌ర్ గ‌ణ‌తంత్ర ప్ర‌సంగంలో నేడు ప్ర‌క‌ట‌న‌?

  • Published Jan 26, 2022 | 2:27 AM Updated Updated Jan 26, 2022 | 2:27 AM
ఇవే కొత్త జిల్లాలు : గజిట్ విడుదల,గ‌వ‌ర్న‌ర్ గ‌ణ‌తంత్ర ప్ర‌సంగంలో నేడు ప్ర‌క‌ట‌న‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా మంత్రివ‌ర్గం కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. విశేషం ఏంటంటే.. కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా ఆన్ లైన్ లోనే మంత్రుల ఆమోదం పొందింది.దీనికి సంబంధించి గత రాత్రి గజిట్ విడుదలయ్యింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప్ర‌సంగంలో ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు.. 1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టం ప్ర‌కారం.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది. అలాగే.. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలోని క‌మిటీ రూపొందించిన నివేదిక‌ను స‌మీర్ శ‌ర్మ క‌లెక్ట‌ర్ల‌కు పంపించారు.

పెరిగిన జ‌నాభాకు అనుగుణంగా ప‌రిపాల‌నను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవ‌స‌ర‌మ‌ని ఇంతకు ముందు వైసీపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓ జిల్లా చేస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ కూడా పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. అయితే.. ఆయా ప్రాంతాల స్వ‌రూపం, అక్క‌డి భౌగోళిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చిన్నచిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు బాప‌ట్ల లోక్ స‌భను ఓ జిల్లాగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని సంత‌నూత‌లపాడు ప్ర‌కాశం జిల్లాలోనే కొన‌సాగ‌నుంది. ఇలాగే కొన్ని లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పుచేర్పులు ఉండ‌నున్నాయి.

కొత్త జిల్లాలు ఇవే..

కొత్తగా పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా,అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా,విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్  కృష్ణా జిల్లా,బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లా,నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా,నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా,రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా,తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటు అవుతున్నాయి.

శ్రీకాకుళం :ఇచ్ఛాపురం ,పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం,ఎచ్చెర్ల 

విజయనగరం : విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం,,ఎస్‌.కోట

విశాఖ : భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్, సౌత్‌

అనకాపల్లి : అనకాపల్లి,చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి, యలమంచిలి,మాడ్గుల, నర్సీపట్నం.

అల్లూరి సీతారామరాజు : అరకు,పాడేరు,రంపచోడవరం

మన్యం: పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ

తూర్పు గోదావరి  : కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం,రాజమండ్రి సిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి

కాకినాడ : కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం

కోనసీమ  : అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం

ఏలూరు : ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు

నరసాపురం : నరసాపురం, ఉండి,భీమవరం,పాలకొల్లు, ఆచంట, తణుకు,తాడేపల్లిగూడెం

ఎన్టీఆర్  కృష్ణా : విజయవాడ ఈస్ట్‌, వెస్ట్, సెంట్రల్‌, నందిగామ,జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు

మచిలీపట్నం   : మచిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం

భావపురి  : బాపట్ల,రేపల్లె,వేమూరు,చీరాల,పరుచూరు,అద్దంకి 

గుంటూరు : గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, ప్రత్తిపాడు,పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి

పల్నాడు  : నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు

ఒంగోలు : ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు,మార్కాపురం,ఎర్రగొండపాలెం,సంతనూతలపాడు

నెల్లూరు : నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు,కావలి,ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు,సర్వేపల్లి

శ్రీ బాలాజీ  : తిరుపతి,శ్రీకాళహస్తి,సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట,చంద్రగిరి

చిత్తూరు : చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు,పూతలపట్టు, పలమనేరు, కుప్పం,పుంగనూరు

అన్నమయ్య : రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి

కడప : కడప, పులివెందుల, జమ్మలమడుగు,ప్రొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు

నంద్యాల : నందికొట్కూరు,శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల

కర్నూలు : కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ,పాణ్యం.

అనంతపురం : అనంతపురం, సింగనమల,తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం,రాయదుర్గం ,రాప్తాడు

శ్రీసత్యసాయి  : హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి

ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మీద ప్రజల అభిప్రాయాలను ,అభ్యంతరాలను తెలియచేయటానికి 30 రోజులు అంటే ఫిబ్రవరి 24 వరకు అవకాశం ఇచ్చారు.