Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్‌ను దూషించిన తర్వాత మొదలైన రాజకీయ పరిణామాలు.. ఎన్నికల్లో గెలుపోటములపై సవాళ్లు విసురుకునే దశకు చేరుకున్నాయి. చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో.. అక్కడ మాట్లాడిన పరిటాల రవీంద్ర సతీమణి మాజీ మంత్రి పరిటాల సునీత.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని, చంద్రబాబు గంటపాటు కళ్లు మూసుకుంటే చాలు తాము ఏమిటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడంతోపాటు.. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని మాట్లాడి.. సవాళ్ల రాజకీయానికి తెరలేపారు.
సునీత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. పరిటాల సునీతను.. ‘ మా వదిన’ అంటూ ఎంతో గౌరవంగా సంబోధించిన వంశీ.. అమ్మకు, కడుపులోని బిడ్డకు కూడా గొడవలు పెట్టగల సమర్థుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం కాదు.. ఇప్పుడు ఓడించాలని వంశీ సంచలన ప్రతిపాదన చంద్రబాబు, సునీతల ముందు పెట్టారు. తాను గన్నవరం నుంచి తక్షణమే రాజీనామా చేస్తానని, ఆ స్థానంలో నారా లోకేష్ చేత పోటీ చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. పరిటాల సునీతను సారధ్యం వహించాలని కోరారు.
వంశీ చేసిన సవాల్ ఏదో ఆషామాషీగా చేసినట్లు కనిపించడం లేదు. స్పీకర్ ఫార్మాట్‌తో ఉన్న రాజీనామా లేఖను తనతో మాట్లాడిన ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధికి ఇస్తామని చెప్పారు వంశీ. మరి వంశీ సవాల్‌పై పరిటాల సునీత ఎలా స్పందిస్తారో చూడాలి.
వంశీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని పరిటాల సునీత అనడం, అందుకు ధీటుగా వంశీ స్పందించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు. వల్లభనేని వంశీ.. పరిటాల అనుచరుడుగా రాజకీయాల్లోకి వచ్చారు. పరిటాల రవిని, ఆయన కుటుంబాన్ని ఇప్పటికీ అభిమానిస్తారు. గౌరవిస్తున్నారు. అలాంటిది పరిటాల సునీత, వల్లభనేని వంశీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం విశేషం.
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన వంశీ.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీకి దూరంగా, వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. వంశీ వైసీపీకి దగ్గరకావడాన్ని సహించలేని చంద్రబాబు, వంశీకి అత్యంత ఆప్తులైన పరిటాల సునీత చేత టార్గెట్ చేయించారని స్పష్టంగా తెలుస్తోంది. సొంత పార్టీలోని నేతలను అణచివేసేందుకు వారికి బాగా కావాల్సిన వారిచేతనే వ్యతిరేకంగా మాట్లాడించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అదే విద్యను ఆయన వంశీ విషయంలోనూ అమలు చేశారు. సునీత వ్యాఖ్యలకు వంశీ స్పందించారు. మరి వంశీ సవాల్‌కు సునీత స్పందిస్తారా..? లేదా..? వంశీ సవాల్ కార్యరూపం దాల్చుతుందా..? వేచి చూడాలి.
Also Read : Lokesh Mangalagiri -మంగళగిరిని కానుకగా ఇస్తారట, వచ్చే ఎన్నికలపై లోకేష్ స్పష్టత