iDreamPost
android-app
ios-app

గగన్ యాన్.. మరో చరిత్రను సృష్టించిన ఇస్రో.. విజయవంతంగా..

చంద్రయాన్-3 సక్సెస్ తో జోష్ లో ఉన్న ఇస్రో, మానవ సహిత ప్రయోగానికి సిద్ధమైంది. ఇందు కోసం గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని నిమిత్తం వివిధ ప్రయోగాలను నిర్వహిస్తుంది. తాజాగా ఓ పరీక్ష చేపట్టగా.. షెడ్యూల్ సమయానికి ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రయోగాన్ని అరగంట వాయిదా వేసింది. అయితే..

చంద్రయాన్-3 సక్సెస్ తో జోష్ లో ఉన్న ఇస్రో, మానవ సహిత ప్రయోగానికి సిద్ధమైంది. ఇందు కోసం గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీని నిమిత్తం వివిధ ప్రయోగాలను నిర్వహిస్తుంది. తాజాగా ఓ పరీక్ష చేపట్టగా.. షెడ్యూల్ సమయానికి ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రయోగాన్ని అరగంట వాయిదా వేసింది. అయితే..

గగన్ యాన్.. మరో చరిత్రను సృష్టించిన ఇస్రో.. విజయవంతంగా..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో లిఖించుకుంది. ఇప్పటికే చంద్రయాన్-3 సక్సెస్‌తో ప్రపంచ దేశాలన్నీ.. భారత్ వైపే చూసేలా చేసింది. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో ఎంతో ప్రతిషాత్మకంగా మానవ సహిత ప్రాజెక్టు గగన్ యాన్ చేపడుతుంది. దీని కోసం వివిధ ప్రయోగాలను చేస్తుంది. నేడు టీవీ- డీ1 ఫ్లైట్ టెస్ట్ చేపట్టింది. గగన్ యాన్‌లో వినియోగించే ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 వాహన నౌక తొలి పరీక్షను శనివారం ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ పని తీరును పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ నుండి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే అనుకున్న సమయానికన్నా రెండు గంటల ఆలస్యమైంది.

ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు షెడ్యూల్ చేయగా.. చివరి నిమిషంలో రెండు గంటలు వాయిదా పడింది. ఉదయం 8 గంటలకు పరీక్షించాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకోవడంతో మరో అరగంట వాయిదా వేసింది ఇస్రో, అయితే ప్రయోగం చేపడుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిపివేశారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత లోపాన్ని గుర్తించి.. తిరిగి ఉదయం 10 గంటలకు ప్రయోగాన్ని చేపట్టారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. 17 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత.. అందులోని క్రూ మాడ్యుల్ వ్యవస్థ వేరు పడింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ రాకెట్ నుండి విడిబడ్డాయి. దాని నుండి పారాచూట్ విచ్చుకవడంతో దాని సాయంతో క్రూ మాడ్యుల్ మెల్లగా కిందకి దిగుతూ బంగాళా ఖాతంలో పడింది.

ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. క్రూ మాడ్యుల్ సముద్రంలో పడిందని తెలిపారు. శ్రీహరి కోట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఆ మాడ్యుల్ ల్యాండ్ అయింది. నేవీ సిబ్బంది సాయంతో దీనిని తీసుకురానున్నారు. గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా క్రూ మాడ్యుల్ లో ప్రయాణించే ఆస్ట్రోనట్స్ ఏదైనా అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు తప్పించుకుని, భూమికి సురక్షితంగా చేరుకోవడమే ఈ మిషన్ ప్రయోగం వెనుక ముఖ్య ఉద్దేశం.