Idream media
Idream media
ఆయన మూడు పర్యాయాలు ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబునాయుడు కుమారుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అంతేకాదు ఎమ్మెల్సీ కూడా. అలాంటి వ్యక్తి కనీసం జెడ్ పీటీసీగా గెలవగలడా? ఊహిస్తేనే విచిత్రంగా ఉంది కదూ..! ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ తో టీడీపీ శ్రేణులు కూడా ధర్మసంకటంలో పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి అలా ఉంది మరి. హైకోర్టు తీర్పుతో త్వరలో ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ సవాల్ ఆసక్తిగా మారింది.
ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ ఈ ఎన్నికలను రాజకీయంగా వాడుకొవాలని చూశారని విమర్షించారు. వీరికి పోటీలో నిలబెట్టడానికి అభ్యర్థులు దొరక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడికి దిగారన్నారు. చాలా స్థానాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏకగ్రీవం కావడం పట్ల టీడీపీ కావాలనే రాద్ధాంతం చేసిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
ఏ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందో మున్సిపల్ ఫలితాలు చూస్తే తెలిపిపోతుందన్నారు. అయితే , చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలను దూశించారని, అందుకే వారు ఓట్లరూపంలో బాబుకు సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కనీసం జెడ్‌పీటీసీగా అయినా నిలబెట్టి గెలిపించుకోగలరా అని సవాల్ విసిరి టీడీపీ శ్రేణులు అవాక్కయ్యేలా చేశారు. అలాగే చంద్రబాబుపై కూడా ఆరోపణలు చేశారు.
చంద్రబాబుకి మాత్రం దోచుకోవడం, దాచుకోవం మాత్రమే తెలుసన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి హమీని జగన్‌మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. కాగా, ఉల్లి ధరలు పెరిగితే సబ్సీడి కింద అందించారని తెలిపారు. కాగా, 75 మున్సిపాలీటిలలో టీడీపీ ఒక్క స్థానం కూడా గెలవలేదని, 12కార్పోరేషన్‌లలో డిపాజిట్‌లు కూడా దక్కలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ తమ భాషను మార్చుకొవాలన్నారు.
కాగా, ఏపీ ఎన్నికల కమీషనర్ ఒక రాజ్యంగ బద్ధ పదవిలోఉండి రాజకీయా పార్టీలతో హోటళ్ళలో రహస్యంగా కలవడం దేనికి సంకేతమని అన్నారు. ఇప్పటికైన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. చంద్రబాబుకు చిత్త శుధ్ది ఉంటే కోర్తులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోకుండా విచారణను ఎదుర్కొవాలని డిమాండ్ చేశారు. కాగా, చంద్రబాబు హయాంలో నీరు చెట్టు పేరుతో వేలకోట్లు దోచేశారని, చెత్తతో సంపద సృష్ఠి అన్నారు.. ఎక్కడ సృష్టించారో తెలపాలన్నారు. ప్రజలకు టీడీపీ పార్టీ పట్ల పూర్తిగా నమ్మకం పోయిందని శ్రీకాంత్‌రెడ్డి విమర్షించారు.