iDreamPost
iDreamPost
తెలుగునాట అతి పెద్ద పండగల్లో వినాయకచవితి ఒకటి. వీధి వీధినా విగ్రహాలు పెట్టుకుని ఇంట్లో నిష్టగా పూజలు చేసుకుని సెలవును మనసారా ఆస్వాదించి వినోదాన్ని సినిమా రూపంలో అందుకోవడం మనకు అలవాటే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈసారి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం ఎలాంటి లోటు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో కనువిందు చేసే సినిమాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ముందుగా ‘టక్ జగదీష్’ మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే పండగ టైం వృధా కాకుండా ముందు రోజు రాత్రి 10 గంటలకే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతోందని సమాచారం.
మరుసటి రోజు ‘సీటిమార్’ థియేటర్లకు వెళ్లి చూడొచ్చు. గోపిచంద్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా మీద లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద బిజినెస్ జరిగింది. అంచనాలు అందుకుందా వసూళ్ల వర్షం ఖాయం. అదే రోజు రాహుల్ రామకృష్ణ అవికా గోర్ లు నటించిన ‘నెట్’ జీ5లో టెలికాస్ట్ కాబోతోంది. యూనిట్ ప్రమోషన్ ని గట్టిగానే చేస్తోంది. ఒకవేళ మీకు తమిళం వస్తే సన్ టీవీలో విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ని ఫస్ట్ డేనే చూసేయొచ్చు. ఒక రోజు ముందు 9న ఇదే హీరో ‘లాభం’ థియేటర్లకు వస్తున్న సంగతి తెలిసిందే. కంగనా రౌనత్ ‘తలైవి’ కూడా హాళ్ళకే వస్తోంది. సో మూవీ లవర్స్ కి అటు ఇంట్లో ఇటు బయట రెండిట్లోనూ చాలా ఆప్షన్స్ ఉండబోతున్నాయి.
సో ఎంటర్ టైన్మెంట్ కి ఎలాంటి లోటు లేనట్టే. ఓటిటిలో వచ్చే సినిమాలకు లాభ నష్టాల లెక్కలు ఉండవు కాబట్టి రీచ్ విషయంలోనూ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఎటొచ్చి సీటిమార్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జనాన్ని థియేటర్ దాకా రప్పించాలంటే టాక్ బలంగా తెచ్చుకోవాలి. ట్రైలర్లు వగైరా మాస్ కు ఫుల్ మీల్స్ అనే తరహాలో ఇంప్రెషన్ ఇచ్చినప్పటికీ మొదటి షో అయ్యేదాకా ఏదీ చెప్పలేం. ఇక టక్ జగదీష్ కూడా వ్యూస్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఆకాశం నీ హద్దురా, నారప్పలను దాటేసి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయొచ్చని ఫాన్స్ ఆశిస్తున్నారు. చూద్దాం
Also Read : మా ఎన్నికలలో ఇంకెన్ని ట్విస్టులో