మరికొందరు మాత్రం లక్ష్యం కోసం బలంగా పని చేస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంటారు. ఎన్ని అపజయాలు ఎదురైన, నిరుత్సాహం చెందకుండా.. లక్ష్యం వైపు పరుగులు తీస్తుంటారు.
మరికొందరు మాత్రం లక్ష్యం కోసం బలంగా పని చేస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంటారు. ఎన్ని అపజయాలు ఎదురైన, నిరుత్సాహం చెందకుండా.. లక్ష్యం వైపు పరుగులు తీస్తుంటారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక్కటి సాధించాలనే కోరిక ఉంటుంది. చాలా మంది మధ్యలోనే తమ కోరికలను, లక్ష్యాలను వదిలేస్తుంటారు. మరికొందరు మాత్రం లక్ష్యం కోసం బలంగా పని చేస్తుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుంటారు. ఎన్ని అపజయాలు ఎదురైన, నిరుత్సాహం చెందకుండా.. లక్ష్యం వైపు పరుగులు తీస్తుంటారు. ఇలా పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధించిన వాళ్లే చరిత్ర లో నిలిచిపోతారు. అలానే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇలాంటి విజేతల జాబితాలో 29 ఏళ్ల యువకుడు కూడా చేరాడు. అతడు ప్లేట్లు కడుగుతూనే కష్టపడి చదివి.. నేడు జడ్జి స్థాయికి ఎదిగాడు. మరి.. ఆ యువకుడి సక్సెస్ స్టోరి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర ప్రదేశ్ లోని సంభల్ కు చెందిన 29 ఏళ్ల మహమ్మద్ ఖాసిం.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. తన తండ్రి బండిపై టిఫిన్ సెంటర్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తుండే వారు. ఖాసిం కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుండేది. ఇలాంటి స్థితిలో కూడా ఖాసిం.. చదువుపై ఏ మాత్రం అశ్రద్ద చేయలేదు. తమ జీవితాలు మారాలంటే..చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మాడు. తన తండ్రి హోటల్లోనే ప్లేట్లు కడుగుతూ తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం కోసం ప్రయత్నం చేశాడు.
చివరకు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్(జ్యుడిషియల్)-2022 పరీక్షలో ఖాసిం 135వ ర్యాంక్ సాధించారు. ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులను గర్వపడేలా చేశారు. లక్ష్యం కోసం నిబద్ధతో కష్టపడితే ఏదైనా సాధ్యమేనని ఖాసిం నిరూపించారు. ఖాసిం తన చదువును వార్సీ జూనియర్ హైస్కూల్ లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులను అలిఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. 2019లో జరిగిన ఎల్ఎల్ఎమ్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో తొలి ర్యాంక్ సాధించాడు.
అలానే 2021లో యూజీసీ ఎన్ఈటీ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాడు. ఒకవైపు హోటల్లో తన తండ్రికి సాయం చేస్తూనే… మరొకవైపు అనుకున్న లక్ష్యం కోసం కష్టపడ్డాడు. చివరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్ని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా.. సంభల్ ప్రాంత యువతకు ఖాసీం ఆదర్శంగా నిలిచాడు. మరి.. డబ్బులు లేవు, కుటుంబ పరిస్థితులు బాగాలేవు అంటూ కారణాలు చెప్తూ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేసే యువతక ఖాసీం ఆదర్శంగా నిలిచారు. మరి.. ఖాసీం సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.