iDreamPost

సనాతన ధర్మ వివాదంపై దూకుడు పెంచిన DMK నేతలు..

సనాతన ధర్మ వివాదంపై దూకుడు పెంచిన DMK నేతలు..

గత కొన్ని రోజుల క్రితం తమిళనాడు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ మాటలపై పెనుదుమారం రేగుతుంది. ఉదయ్ నిధి స్టాలిన్ పై హిందు సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచకపడుతున్నారు. ఓ స్వామిజీ ఏకంగా ఉదయ్ నిధి స్టాలిన్ ని చంపుతే.. రూ.10 కోట్లు ఇస్తానంటూ ప్రకటన చేశాడు.

అయితే ఇదే సమయంలో డీఏంకే నేతలు మాత్రం ఉదయ్ నిధికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. డీఎంకే కు చెందిన  మరికొందరు నేతలు సనాతన ధర్మ వివాదంపై దూకుడు పెంచి.. మరికొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేస్తోన్నారు. తాజాగా డీఎంకే పార్టీ ఎంపీ ఎం. రాజా.. సనాతన ధర్మం.. హెచ్ఐవీ, కుష్టు రోగం వంటిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  గురువారం తమిళనాడులోని చెన్నైలో ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ ఏ.రాజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన వేరు వేరు కాదని, అవి రెండూ ఒకటేనని ఆయన అన్నారు. అవి మలేరియా, డెంగ్యూ వంటివంటూ హాట్ కామెంట్స్ చేశారు. వాటిని తరిమికొట్టాలని ఉదయనిధి స్టాలిన్ మృదువుగా చెప్పారు. నిజాని సనాతన ధర్మం, విశ్వకర్మ యోజనలు హెచ్ఐవీ, కుష్ఠువ్యాధి లాంటివని, కాకపోతే ఈ వ్యాధులకు సామాజిక కళంకం లేదన్నారు. అయినప్పటికీ వాటిని అసహ్యంగా చూస్తారని, సనాతన ధర్మం అంత కంటే కూడా ఎక్కువని రాజా అన్నారు.

ఇక ఉదయ నిధిని  చేసిన వ్యాఖ్యలను ఆయన తండ్రి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమర్ధించారు. సనాతన ధర్మం ఎస్సీ, ఎస్టీ మహిళలకు వ్యతిరేకమన్నారు. ఉదయనిధి  చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని, అలానే తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఈ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్పందించారు. ఈ విషయమై సరైన సమాధానాలు ఇవ్వాలని బుధవారం జరిగిన సమావేశంలో తన మంత్రులకు సూచించారు. మరి.. సనాతన ధర్మ వివాదంపై డీఎంకే నేతలు దూకుడు పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి