iDreamPost
iDreamPost
1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 1980 వరకూ పోలవరం ప్రాజెక్టుపై ఏ ఒక్క ముఖ్యమంత్రి దృష్టి సారించిన దాఖలాలు లేవు. 1980లో నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించాలనే తలంపుతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం, జూరాల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆనాటి నుండి 2004 వరకూ పోలవరంవైపు ఏ ముఖ్యమంత్రి దృష్టి సారించిన పాపాన పోలేదు .
వైయసార్ అలుపెరగని పోరాటం..
“మహాప్రస్థానం” పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీటి గాథలను అతి దగ్గర నుండి చూసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగు నేల నుంచి కరవును తరిమికొడతానని ప్రతినబూనారు. పోలవరాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలు కూడా తిరక్కుండానే రూ.10,151.64 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి పరిపాలనపరమైన అనుమతులను సెప్టెంబరు 2004లో జారీ చేశారు. ఆ తర్వాత అదే నెలలో పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి సైట్ క్లియరెన్స్‌ను కేంద్రం నుంచి సాధించారు.
Also Read: ముఖ్యమంత్రి జగన్ అపర భగీరథుడు
2004 నవంబర్ 29న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైఎస్.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను సాధించడం కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఫలితంగా 2005 అక్టోబర్ నెలలో పర్యావరణ అనుమతిని, 2007 ఏప్రిల్ నెలలో సహాయ, పునరావాస ప్యాకేజీ(ఆర్ అండ్ ఆర్)కీ, 2008 సెప్టెంబరు నెలలో అభయారణ్యం అనుమతిని, డిసెంబర్ లో అటవీ శాఖ అనుమతిని, 2009 జనవరి నెలలో సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ అనుమతిని కేంద్రం జారీ చేసింది. 2009లోనే హైపవర్ స్టాండింగ్ కమిటీ జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది . దాంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రధాన పనులు పూర్తి చేసే క్రమంలోనే వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో దివంగతులయ్యారు.
10వేల 151.64 కోట్లు అంచనాతో ప్రాజెక్టు మొదలు పెట్టి అన్ని అనుమతులు తెప్పించి, రూ.5,135 కోట్ల విలువైన పనులు పూర్తి చేసి ప్రాజెక్టు కి ఒక రూపం తెచ్చి కొంత పనిని వైయస్సార్ ఆయన హయాంలో పూర్తి చేశారు. అలా ఒక రూపం వచ్చింది కాబట్టి కేంద్రం ఆ ప్రాజెక్టు ని జాతీయ ప్రాజెక్టు గా గుర్తించి జాతీయ హోదా కల్పించి విభజన చట్టంలో పెట్టింది. 2014 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పోలవరాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడం, ప్రాజెక్టు పూర్తికి జరగవలసిన పనులను పక్కన పెట్టి ప్రాజెక్టును కేవలం ప్రచారానికి వాడుకోవడంతో ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయి.
Also Read: ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి గా ప్రమాణశ్వీకారం చేసిన జగన్ పోలవరాన్ని తన హాయాంలో పూర్తి చేయాలనే దృడసంకల్పంతో పనులను వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా నేడు పోలవరాన్ని సందర్శించిన జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని అడ్డంకులు ఏదురైనా తమ ప్రభుత్వ పాలనలోనే పోలవరాన్ని పూర్తి చేయబోతునట్టు, ఆ ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టుకు ప్రాణం పోసిన దివంగతనేత వైయస్సార్ 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతునట్టు ప్రకటించారు.