iDreamPost
android-app
ios-app

ఇద్దరు పిల్లలున్న వారికి పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. రూ.6 లక్షలు మీ అకౌంట్లోకి!

  • Published May 16, 2024 | 11:19 AMUpdated May 16, 2024 | 11:19 AM

తాజాగా ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల పేరిట పోస్టు ఆఫీసులో అద్భుతమైన మరో కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. మరి, ఆ పథకం వివారాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల పేరిట పోస్టు ఆఫీసులో అద్భుతమైన మరో కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. మరి, ఆ పథకం వివారాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published May 16, 2024 | 11:19 AMUpdated May 16, 2024 | 11:19 AM
ఇద్దరు పిల్లలున్న వారికి పోస్టాఫీస్ గుడ్ న్యూస్.. రూ.6 లక్షలు మీ అకౌంట్లోకి!

ప్రస్తుత రోజుల్లో ఇంట్లో ఎంతమంది కష్టపడి సంపాదించిన వచ్చిన ఆదాయం మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూ ఉంటుంది. అయితే నెల నెలా ఎంతో కొంత సేవింగ్స్‌ కింద పొదుపు రూపంలో దాచుకుంటే.. భవిష్యత్తుకు ఉపాయోగపడుతుందనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉంటుంది. అందుకోసం ఇటీవల కాలంలో  వివిధ బ్యాంకుల్లో పొదుపు పేరిట అనేక పథకాలను అందుబాటులోకి ఉన్నాయి. అందులో ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంక్ లు డబ్బులను డిపాజిట్ చేయించుకుంటారు. వాటికి సంవత్సరానికి వడ్డీని చెల్లిస్తాయి. అయితే పొదుపు పథకాల‍నేవి బ్యాంకుల్లోని  కంటే.. పోస్టు ఆఫీసులో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

పైగా పోస్టు ఆఫీసులో ఉన్న పథకాలు అనేవి చాలా సురక్షితమైనవి అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ పోస్టు ఆఫీస్‌ లోని మహిళలకు వృద్ధలుకు, పిల్లలకు రకరకాల స్కీమ్స్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఇద్దరు పిల్లల పేరిట పోస్టు ఆఫీసులో మరో కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. ఇక ఆ పథకం పేరే బాల్‌ జీవన్‌ భీమా యోజన. ఈ పథకంలో కేవలం రోజుకు రూ. 6 పొదుపు చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయల రాబడి పొందుతారు. ఒక వేళ మీరు రూ.18 పొదుపు చేస్తే.. 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇలా పొదుపు చేసే వారి స్థోమతను బట్టి రోజుకు రూ..6 లేదా రూ.18 వరకు ఉంటుంది. అయితే పొదుపు అనేది పిల్లల పేర్ల మీద మాత్రమే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల వయసు కనీసం 5 నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే తల్లిదండ్రులు వయసు కూడా ఈ స్కీమ్‌ పెట్టుబడికి పరిగణలోకి తీసుకుంటారు.

Post Office Scheme

అయితే ఈ స్కీమ్‌ లో తల్లిదండ్రులకు కనీస వయసు 45 ఏళ్లకు మించి ఉండకూడదు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్‌ వర్తించదు. కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. కాగా, ఇద్దరు పిల్లల మీద రోజుకు రూ.36 పొదుపు చేస్తే మెచ్చూరిటీ సమయానికి ఇద్దరిది కలిపి మొత్తం రూ. 6 లక్షల వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మీరు సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి.. సంబంధిత అధికారులను సంప్రదించి ​ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక అందులో మీరు  అర్హులుగా ఉంటే.. ఈ స్కీమ్ లో చేరవచ్చు. అలాగే దరఖాస్తుదారు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించి.. అకౌంట్​ను ఓపెన్ చేయవచ్చు. మరి, కుటుంబంలో ఇద్దరు పిల్లల కోసం కొత్తగా పోస్టు ఆఫీసులో అందుబాటులో ఉ‍న్న ఈ కొత్త స్కీమ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి