iDreamPost
iDreamPost
అర్జెంటీనాకి చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అతను మరణించినా కొన్ని రికార్డులు ఇంకా అతని పేరు మీదే ఉన్నాయి. తాజాగా మరణించిన తర్వాత అతని జెర్సీ కూడా రికార్డు సృష్టించింది. 1986 ప్రపంచకప్‌లో అతడు ధరించిన జెర్సీని వేలం వేయగా రికార్డు ధరకి అమ్ముడుపోయింది.
క్రీడా స్మారకాల వేలంలో డీగో మారడోనా వేసుకున్న జెర్సీ దాదాపుగా రూ.70 కోట్లకు (9.3 మిలియన్ డాలర్లు) కొనుక్కున్నారు. అయితే ఈ జెర్సీ 1986 ప్రపంచకప్‌లోఇంగ్లాండ్‌తో క్వార్టర్‌ఫైనల్‌లో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. మారడోనా అసాధారణ రీతిలో బంతిని డ్రిబిల్ చేసుకుంటూ ఇంగ్లాండ్ ఆటగాళ్లందరినీ తప్పించుకుంటూ ఈ గోల్ ని నమోదు చేశాడు. దీంతో ఈ మ్యాచ్, ఆ గోల్ రెండు హైలెట్ అయ్యాయి. ఫుట్‌బాల్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన డీగో మారడోనా 2020లో మరణించిన సంగతి తెలసిందే.
మారడోనా జెర్సీ 9.3 మిలియన్ డాలర్లకి అమ్ముడుపోవడంతో క్రీడా స్మారకాల వేలంలో ఆధునిక ఒలింపిక్ మూమెంట్ మేనిఫెస్టో (8.8 మిలియన్ డాలర్లు) పేరు మీద ఉన్న రికార్డును కొల్లగొట్టింది. అయితే మారడోనా జెర్సీని కొనుగోలు చేసిన వారి వివరాలను వెల్లడించలేదు. ఒక జెర్సీని ఇంత భారీ ధరకి ఎవరూ కొనుక్కున్నారబ్బా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.