PAK Elections:పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ! ఈమె కథ ఏమిటంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ఒక ఎత్తయితే.. ప్రస్తుతం దాయాది దేశమైన పాకిస్తాన్ లో ఎన్నికల సందడి మరొక ఎత్తు. మొట్టమొదటి సారిగా పాకిస్తాన్ ఎన్నికలలో ఓ హిందూ మహిళ పోటీ చేయబోతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి ఒక ఎత్తయితే.. ప్రస్తుతం దాయాది దేశమైన పాకిస్తాన్ లో ఎన్నికల సందడి మరొక ఎత్తు. మొట్టమొదటి సారిగా పాకిస్తాన్ ఎన్నికలలో ఓ హిందూ మహిళ పోటీ చేయబోతుంది.

పాకిస్తాన్ లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, సాధారణంగానే పాకిస్తాన్ లో హిందువులకు ఏ విషయంలోనైనా అవకాశాలు తక్కువ. అలాంటిది ఈసారి ఎన్నికలలో ఏకంగా ఒక హిందూ మహిళ పోటీ చేయబోతుంది. మొట్ట మొదటిసారిగా ఒక హిందూ మహిళ ఇలా పాకిస్తాన్ ఎన్నికల బరిలో నిలవడం అనేది విశేషం. ఆమె పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరపున.. ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వాలోని బునెర్‌ జిల్లాలో ఒక జనరల్ సీటు నుంచి అధికారికంగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె పేరు సవీరా ప్రకాష్. పాకిస్తాన్ లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా, ప్రత్యేకంగా ఇప్పుడు సవీరా వార్తల్లో నిలిచారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

‘సవీరా ప్రకాష్’ ప్రస్తుతం ఈమె పాకిస్తాన్ లో వేసిన నామినేషన్ కారణంగా.. అందరికి ఈమెపైన ఆసక్తి కలిగేలా చేసింది. సవీరా తండ్రి పేరు ఓం ప్రకాష్ . ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఓం ప్రకాష్ గత 35 ఏళ్లుగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతగా అంకితభావంతో పనిచేస్తున్నారు. కాగా, గతంలో ఒక వైద్యుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. అయితే, సవీరా ప్రకాష్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాను అంటూ చెప్పారు. అటు రాజకీయంగానూ, ఇటు వృత్తిలోనూ తన తండ్రి వారసత్వాన్ని తీసుకుని.. ప్రజలకు సేవ చేసేందుకు ముందు అడుగు వేసింది సవీరా ప్రకాష్.

 

సవీరా 2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక వైద్యురాలిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసింది. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన పేదల నిస్సహాయ పరిస్థితులను గమనించి.. వారి జీవితాలకు అండగా నిలవాలని భావించి.. ఎన్నికలలో పోటీ చేసినట్లు సవీరా తెలిపింది. సవీరా ప్రస్తుతం పీపీపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతోంది. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఆమె పని చేస్తోంది. అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో గతవారమే ఆమె నామినేషన్ దాఖలు చేసింది.

కాగా, ఈ ఎన్నికలలో దాదాపు 28,600 మంది పోటీ చేయనున్నారు. అందులో మూడు వేల మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అయితే, వారిలో జనరల్ స్థానం నుంచి మొట్ట మొదట హిందూ మహిళగా ఎంపికైన వారు మాత్రం సవీరా ప్రకాష్. దీనితో ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పాకిస్తాన్ ఎన్నికల విషయానికొస్తే.. ఈ ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని సవరణలు చేసింది. జనరల్ స్థానాల్లో 5 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించాలని నిర్ణయించింది. కాగా పాకిస్థాన్‌లో 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8, 2024న జరగనున్నాయి. మరి, పాకిస్తాన్ ఎన్నికల బరిలో నిలుచున్న మొదటి హిందూ మహిళైన సవీరా ప్రకాష్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments