iDreamPost
android-app
ios-app

ఘోరం.. 13 మందికి విషం పెట్టి చంపిన యువతి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

  • Published Oct 08, 2024 | 10:59 AM Updated Updated Oct 08, 2024 | 2:33 PM

ప్రేమ కోసం ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. 13 మందికి విషం పెట్టి చంపేసింది. మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.

ప్రేమ కోసం ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. 13 మందికి విషం పెట్టి చంపేసింది. మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.

  • Published Oct 08, 2024 | 10:59 AMUpdated Oct 08, 2024 | 2:33 PM
ఘోరం.. 13 మందికి విషం పెట్టి చంపిన యువతి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రేమ రెండు మనసుల కలయిక. ప్రేమంటే ఓ మధురమైన అనుభూతి. ఎప్పుడు? ఎలా? లవ్ పుడుతుందో చెప్పలేము. ఒక వ్యక్తిపై ఒక్కసారి కలిగిన ప్రేమ ఊపిరి ఉన్నతం వరకు ఉంటుంది. ప్రేమంటే నమ్మకం. లవ్ లో ఉన్నవాళ్లు లోకం మరిచి ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ప్రేమించిన అమ్మాయిని లేదా అబ్బాయిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఇటీవలి కాలంలో ప్రేమ పేరుతో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమకు గ్యారంటీ, వారంటీ లేకుండా పోతోంది. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో అబ్బాయిలను కూడా ప్రేమ పేరుతో మోసం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రేమ కోసం చంపడానికి లేదా చావడానికి కూడా వెనకాడడం లేదు.

ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ కారణంగా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. ప్రేమించిన వారితో పెళ్లికి ఒప్పుకోకపోతే కుటుంబ సభ్యులను సైతం చంపేందుకు వెనకాడడం లేదు నేటి ప్రేమికులు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13మందికి విషం పెట్టి ప్రాణాలు తీసింది. తాను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లికి అడ్డు చెబుతున్నారని ఓ యువతి ఏకంగా మొత్తం కుటుంబాన్నే కడతేర్చింది. అత్యంత దారుణమైన ఈ ఘటన పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్సులోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. షైస్తా బ్రోహి అనే యువతి అమీర్ బక్ష్‌అనే యువకుడితో ప్రేమలో పడింది.

అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి జరిపించాలని యువతి కుటుంబ సభ్యులను కోరింది. అయితే వారు ఈ ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వీరందర్ని చంపేందుకు గోధుమ పిండిలో విషం కలిపి, చపాతీలు చేసి 13 మంది కుటుంబ సభ్యులకు వడ్డించింది. వీటిని తిన్న తర్వాత వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందరు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షైస్తా బ్రోహిని అనే యువతిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అమీర్ బక్ష్‌తో ప్రేమలో ఉన్నానని తెలిపింది. తమ పెళ్లికి కుటుంబం అంగీకరించలేదని చెప్పింది.

అమీర్ తనకు ఓ లిక్విడ్ ఇచ్చి ఆహారంలో కలపమని చెప్పినట్లు వెల్లడించింది. ఇది తిన్న తర్వాత మీ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరిస్తారని అతను చెప్పినట్లు తెలిపింది. అతను చెప్పినట్లుగానే విషం కలిపిన చపాతీలను కుటుంబ సభ్యులకు వడ్డించి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం షైస్తా, అమీర్ బక్ష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్ మార్టం నివేదికలో విష ప్రయోగం జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. తన ప్రియుడి సాయంతోనే విష ప్రయోగం చేసినట్లు యువతి అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రేమ కోసం కుటుంబ సభ్యులను మట్టుబెట్టిన యువతిపై మండిపడుతున్నారు. మరి తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో విషం పెట్టి చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş