iDreamPost
android-app
ios-app

అర్ధం చేసుకోండంటున్న కేసీఆర్

అర్ధం చేసుకోండంటున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మొన్నటి వరకు వచ్చిన విమర్శలను ఎలా అయినాసరే తిప్పి కొట్టే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బందికరంగా ఉన్న సరే ఆదాయ మార్గాలను పెంచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించే ప్రయత్నం చేస్తోంది. భూముల అమ్మకం ద్వారా వచ్చిన రెండు వేల కోట్లను దళిత బంధు పథకానికి కేటాయించే అవకాశం ఉంది అని ప్రచారం కూడా ఎక్కువగా ఉంది.

అలాగే త్వరలో మరికొన్ని భూములను వేలం వేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉందని వాటి ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను పంచుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో చాలా వరకూ వెనుకబడిన కులాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం గా ఉన్నాయి అనే వార్తలు ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత దీనిపై ఇతర కులాలు చాలావరకు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

దళిత బంధు విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచన మార్చుకోవాలని కొంతమంది ఇతర పార్టీల నాయకులు కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. అయితే దళిత బందు తరహాలో త్వరలోనే మరికొన్ని కులాలు కూడా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ మంత్రులకు ఎమ్మెల్యేలకు అదే విధంగా కొంతమంది కీలక అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది. అసలు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి అనేది ఒకసారి మన క్లుప్తంగా చూసినట్లయితే..

Also Read : చెవిరెడ్డి రూటే సపరేటు…..

మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కీలక అధికారులు అందరూ కూడా అనవసర ఖర్చులను తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పారట. కొన్ని రోజులు ప్రోటోకాల్ నీ పక్కన పెట్టాలని అవసరమైన భద్రతా సిబ్బంది అలాగే ఎక్కడికైనా పర్యటనకు వెళ్లిన సమయంలో అవసరమైన అధికారులు మాత్రమే ఉండాలని అనవసరమైన అధికారులందరినీ తీసుకువెళ్లి ఖర్చు పెంచవద్దు అని కూడా మంత్రులకు చెప్పారట. ప్రోటోకాల్ విషయంలో ఎటువంటి సమస్యలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చు ఆదా చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి నుంచి వార్నింగ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అలాగే కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు కూడా ఖర్చులను తగ్గించుకునే ఉంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలోనే గాడిని పడిన తర్వాత ఏ విధమైన అడుగైనా వేయవచ్చని సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో చెబుతున్నారట. కొన్ని రాష్ట్రాలను పోలుస్తూ ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అంశాలను సీఎం కేసీఆర్ అధికారుల ముందు ప్రస్తావిస్తూ జాగ్రత్త పడకపోతే అటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.

అలాగే అవసరమైతే మినహా హైదరాబాద్ రావద్దని లేని సమస్యలను తెచ్చుకోవద్దని… ప్రచార ఆర్భాటాలు కు పోయి అనవసర ఖర్చులు పెట్టొద్దని కూడా చెప్పారట. అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేటాయించిన నిధులను సక్రమమైన మార్గంలో వాడాలని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఆ నిధులను వాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై కాస్త భారం తగ్గుతుంది అనే అభిప్రాయం కూడా సీఎం కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి గారి మాటలు ఎంతవరకూ మంత్రులు అధికారులు లెక్క చేస్తారు అనేది భవిష్యత్తు చెబుతోంది.

Also Read : ఒంటరి కష్టాలు: రేవంత్ కు కోరస్ ఎక్కడ…?