iDreamPost
android-app
ios-app

వసల కూలీల తరలింపులో వారిదే కీలక పాత్ర : నిర్మలా సీతారామన్‌

వసల కూలీల తరలింపులో వారిదే కీలక పాత్ర : నిర్మలా సీతారామన్‌

లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కూలీలు పడుతున్న పాట్లును చూసి దేశంతోపాటు తమను ఆవేదనకు గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆర్థిక ప్యాకేజీ పార్ట్‌ – 2 ప్రకటించిన అనంతరం వసల కూలీలు నడచి వెళుతున్న అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె సమాధానం ఇచ్చారు.

వలస కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కూలీలను తరలించేందుకు రైల్వే శాఖ 1200 రైళ్లను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. ఫలానా చోట తమ రాష్ట్ర కూలీలు ఉన్నారని, శ్రామిక్‌ రైళ్లు నడపాలని కోరితే ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్నారు.

ఇప్పటి వరకూ 806 రైళ్ల ద్వారా దాదాపు 10 లక్షల మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాష్ట్రాలు ముందుకు రాకపోతే తాము మాత్రం ఏమి చేయగలమన్నారు. శ్రామిక్‌ రైళ్లు ఉపయోగించుకోవడంలో ఉత్తరప్రదేశ్‌ ముందుందని తెలిపారు. 806 శ్రామిక్‌ రైళ్లకు గాను ఉత్తరప్రదేశ్‌ 326 రైళ్లను ఉపయోగించుకుందని చెప్పారు. ఆ తర్వాత ఝార్ఖండ్‌ 44, రాజస్థాన్‌ 17, పశ్చిమ బెంగాల్‌ 7 శ్రామిక్‌ రైళ్లను బుక్‌ చేసుకున్నాయని చెప్పారు.