Idream media
Idream media
తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఎట్టకేలకు పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. తనకు సెంటిమెంట్ గా వస్తున్న నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్లో ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయాలని ఆమె నిర్ణయించారు.
ఎందుకింత తాత్సారం?
2019 ఎన్నికల్లో ఓటమిపాలైన పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు . అయితే ఆమెకు తిరుపతి లోక్ సభ నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం లేకనో మరో కారణంతోనో తొలి నుంచి నియోజకవర్గ ప్రజలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కనీసం పార్టీ నాయకులతో కూడా ఆమె ఎక్కడ టచ్ లో కూడా ఉండటం లేదు. దీంతో ఆఖరి నిమిషంలో టీడీపీకి హ్యాండ్ చేస్తారని అందరూ భావించారు. దీనిపై చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆమెకు పలు సార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో సోమిరెడ్డిని వారి ఇంటికి పంపించి మాట్లాడారు.
Also Read:ఆధారాలు చూపమంటూనే, అధికారం లేదంటున్న నిమ్మగడ్డ
బిజెపిలో చేరుతారని ప్రచారం?
అప్పట్లో పనబాక లక్ష్మి టిడిపిని వీడి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. దానికి తగినట్లుగానే ఆ పార్టీ జాతీయ నాయకులు కూడా సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగడం గమనార్హం. ఈ విషయంలో ఇటు పనబాక లక్ష్మీ గాని అటు ఆమె భర్త కృష్ణయ్య కూడా స్పందించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరినట్లు అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఆమెతో పలు దఫాలుగా చర్చించారు. తన కుమార్తె ఏలూరు ఆర్డీవో రచన వివాహం ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పార్టీ నేతలకు మాత్రం ఆమె తీరుపై అనుమానాలు లేకపోలేదు.
స్థానిక సంస్థల ఎన్నికలతో మారిన పరిస్థితులు
ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతితో పాటు తిరుపతి లోకసభ నియోజకవర్గంలోని తిరుపతి కార్పొరేషన్,సూళ్లూరుపేట, గూడూరు,వేంకటగిరి మున్సిపాలిటీలు వైసిపి ఏకపక్షంగా కైవసం చేసుకుంది,మొత్తం 125 వార్డుల్లో టీడీపీ కేవలం మూడు మాత్రమే గెలిచింది . దీంతోపాటు పంచాయతీ ఎన్నికల్లోనూ వైసిపి విజయకేతనం ఎగురవేసింది. ఈ ఫలితాలతో టిడిపి అంతర్మధనంలో పడింది. ఈ ఫలితాలు ఏకపక్షంగా రావడంతో లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా వైసిపి భారీ విజయం సాధిస్తుందని టిడిపి నేతల్లో నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పనబాక లక్ష్మి వెనక్కి తగ్గిన అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి.
Also Read:నాగార్జునసాగర్ : తెరపైకి కొత్త కొత్త అభ్యర్థుల పేర్లు
20 నుంచి వరుస సమావేశాలు
వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత కూడా పనబాక లక్ష్మి నుంచి ప్రకటన రావాటంతో ఆవిడ పోటీచేస్తారా లేదా అని మరోసారి చర్చ జరిగింది. ఆ చర్చకు ముగింపు పలుకుతూ తాను నామినేషన్ వేస్తున్నట్లు పనబాక లక్ష్మి ప్రకటించారు.
ఈనెల 20న తిరుపతి లోక్ సభ నియోజకవర్గ కార్యకర్తలతో పనబాక లక్ష్మి సమావేశం నిర్వహించనుంది. సర్వేపల్లి, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. 21న గూడూరు, వెంకటగిరిలో, 22 సత్యవేడు, శ్రీకాళహస్తి, 23 న తిరుపతిలో సమావేశాలు నిర్వహించనున్నారు.
Also Read:ఎవరీ గురుమూర్తి.. ? తిరుపతి వైసీపీ టిక్కెట్ ఎలా దక్కింది..?
వైసీపీ తరఫున అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
వైసిపి తిరుపతి లోక్సభ తన అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఇప్పటికే ఖరారు చేసింది. మొదటి నుంచి ఆయన పేరే వినిపిస్తున్నప్పటికీ వైసిపి ఆచితూచి వ్యవహరించింది. జగన్ తో గురుమూర్తి కి సానిహిత్యం ఉండడంతో పాటుగా ఆయన విద్యావంతులు సౌమ్య శిలిగా పేరు సాధించడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఇప్పటికే పార్టీ నాయకులను కలుసుకున్న ఆయన ఎన్నికల కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఇక్కడ నుంచి ఆయన విజయం నల్లేరు మీద నడకే,మూడు లక్షాలకు పైగా మెజారిటీ సాధించటం మీదనే వైసీపీ దృష్టి పెట్టి పనిచేస్తుంది.