iDreamPost
ఇది అందుకుంటే ఏదో ఇండియన్ ఆస్కార్ గెలుచుకున్నంత సంబరంగా ఉండేది నటీనటులకు.
ఇది అందుకుంటే ఏదో ఇండియన్ ఆస్కార్ గెలుచుకున్నంత సంబరంగా ఉండేది నటీనటులకు.
iDreamPost
ఇప్పుడంటే సైమా, ఈఫాలంటూ బోలెడొచ్చాయి కానీ ఒకప్పుడు జాతీయ అవార్డుల తర్వాత అంత స్థాయిలో గుర్తింపు ఉన్నది ఫిలిం ఫేర్ పురస్కారాలకే. ఇది అందుకుంటే ఏదో ఇండియన్ ఆస్కార్ గెలుచుకున్నంత సంబరంగా ఉండేది నటీనటులకు. మొదట్లో హిందీ సినిమాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు తర్వాత దీన్ని సౌత్ కి కూడా విస్తరించి గ్రాండ్ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా దీని మీద కూడా వివాదాలు, రాజకీయ మరకలు, ప్రలోభాలు లాంటి ఆరోపణలు చుట్టుముట్టాయి కానీ వేటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో అవి నిజమా కదా అనేది నిర్ధారణ కాలేదు. తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ వల్ల ఇప్పుడీ సంస్థకు పెద్ద తలనెప్పే వచ్చి పడింది.
గత ఏడాది నటించిన తలైవిలో పెర్ఫార్మన్స్ కు గాను ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ చేస్తున్నామని దయచేసి రావలసిందిగా కంగనా రౌనత్ కు ఫిలిం ఫేర్ అఫీషియల్ ఇన్విటేషన్ పంపింది. 2014 నుంచే వీటిని బ్యాన్ చేసిన తనకు మళ్ళీ ఆహ్వానం పంపుతారా అంటూ కంగనా రివర్స్ లో ఫైర్ అయిపోయి కేసు వేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తీసుకోనని తెలిసినా ఎందుకు పంపారని మొత్తం లాబీయింగ్ తో నడిచే ఫిలిం ఫేర్ లు తనకు అక్కర్లేదంటూ చెడామడా కడిగి పారేసింది. దీంతో ఫిలిం ఫేర్ తాము కేవలం నామినేట్ చేసినందుకే ఇంతగా రియాక్ట్ అవ్వడం దారుణమని పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినందుకు మేమే లీగల్ గా వెళ్తామని సోషల్ మీడియాలో ప్రకటించింది
ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు కానీ కంగనాకు గతంలో రెండు సార్లు ఫిలిం ఫేర్ వచ్చినప్పుడు ఆవిడ తీసుకోలేదు. ఇష్టం లేదనే సందేశాన్ని పలుమార్లు ఇస్తూనే వచ్చింది. అయినా కూడా ఇలా రిపీట్ కావడంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. తలైవి విషయంలో తను వివాదాలు ఎదురుకున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక షూటింగ్ టైంలో దర్శకుడు క్రిష్ ని తప్పించేసి సోనూ సూద్ క్యారెక్టర్ ని వేరొకరితో వేయించి రీ షూట్ చేయడం లాంటి చాలా ఇష్యూస్ అప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోర్టులకు వెళ్లాలని డిసైడ్ అయిన ఫిలిం ఫేర్, కంగనా రౌనత్ లను చూసి న్యాయస్థానం ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి. ఇలాంటి కేసులు అరుదు కదా