iDreamPost
android-app
ios-app

పండగ ఆఫర్.. కార్లపై ఏకంగా 2 లక్షల వరకు డిస్కౌంట్!

  • Author Soma Sekhar Updated - 11:14 AM, Tue - 17 October 23
  • Author Soma Sekhar Updated - 11:14 AM, Tue - 17 October 23
పండగ ఆఫర్.. కార్లపై ఏకంగా 2 లక్షల వరకు డిస్కౌంట్!

పండగ సీజన్ కావడంతో వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆఫర్లు ప్రకటించి.. కస్టమర్లను దాసోహం చేసుకోవడం మెుదలుపెట్టాయి. ఇక దసరా పండగను పురస్కరించుకుని ఎలక్ట్రిక్ వస్తువులపై అలాగే వాహనాలపై భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి కంపెనీలు. దేశీయ కంపెనీలు మెుదలుకొని విదేశీ కంపెనీలు సైతం భారీగా రాయితీలు ప్రకటిస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కంపెనీ, మోడల్ ను బట్టి వివిధ కార్లపై రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. పండగ వేళ ఇది కళ్లు చెదిరే ఆఫర్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

దసరా పండగ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ, మోడల్ ను బట్టి పలు రకాల కార్లపై రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఇందులో డిస్కౌంట్ తో పాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్లు, లాయాల్టీ బోనస్ లాంటివి అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన హ్యూందాయ్ దసరా పండుగ సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. వివిధ మోడళ్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 నియోస్ పై 43 వేలు, ఆరాపై 33 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఇక ఎలక్ట్రిక్ కారు హ్యూందాయ్ కోనాపై ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ లో పూర్తిగా 2 లక్షల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో ఎక్స్చేంజీ, కార్పోరేట్, లాయాల్టీ బోనస్ ల కోసం వేచి చూడాల్సిన పని లేదు.

అయితే ఇది మీరు కారు కొనుగోలు చేసే ప్రాంతం, డీలర్ షిప్ వంటి కారణాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 23.84 లక్షల నుంచి రూ. 24.03 లక్షలుగా ఉన్నాయి. ఇక ఈ ఈవీ అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 452 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. దీని బ్యాటరీ కెపాసిటీ 39.2 KWPH కాగా.. ఫుల్ ఛార్జింగ్ చేసేందుకు 6 గంటల సమయం పడుతుంది. అలాయ్ వీల్స్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లతో పాటుగా బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. మరి ఈ పండక్కి హ్యూందాయ్ కోనా ఈవీపై ఓ లుక్కేయండి.