iDreamPost
iDreamPost
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా వినోదం ప్రతివారం క్రమం తప్పకుండా ఉంటోంది. కనీసం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ ఉండేలా నిర్మాతలు చేసుకుంటున్న ప్లానింగ్ మూవీ లవర్స్ కి మాములు ఆనందాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఒకే ఫలితాన్ని అందుకోలేకపోయినా పెద్ద చిత్రాలకు చిన్న సినిమాలు ఇచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. తాము థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉండటంతో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. మనల్ని స్ఫూర్తిగా తీసుకునే తమిళనాడులోనూ మొన్న శుక్రవారం నుంచి సినిమా హాళ్లు తెరిచారు.
ఇక రేపటి విషయానికి వస్తే ఇటు థియేటర్ అటు ఓటిటి రెండింటిలోనూ ఎంటర్ టైన్మెంట్ ఉండబోతోంది. సుధీర్ బాబు హీరోగా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అందుకోబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ మౌత్ టాక్ తో బిసి సెంటర్లలో ఇవి బాగా పికప్ అవుతాయనే నమ్మకం వ్యక్తమవుతోంది. సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ మీద ముందు అంచనాలు లేవు కానీ ట్రైలర్ రిలీజ్, త్రివిక్రమ్ అతిధిగా ఈవెంట్ చేయడం లాంటివి అంతో ఇంతో బజ్ తీసుకొచ్చాయి. ఇక నిలబెట్టాల్సింది టాకే.
చిన్నపిల్లలను హీరోగా కమెడియన్లను సరదా విలన్లుగా చేసి తీసిన ‘హౌస్ అరెస్ట్’కు 90 ఎంఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకులు. ఇది కూడా రేపే రాబోతోంది. హైప్ లేదు కానీ బాగుందనే మాట బయటికి వస్తే సేఫ్ అవ్వొచ్చు. ‘సూర్యాస్తమయం’ అనే మరో చిన్న సినిమా థియేటర్లకే సై అంది. సోనీ లివ్ యాప్ లో హాస్య నటుడు సత్య హీరోగా నటించిన ‘వివాహ భోజనంబు’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. మంచి కామెడీ ఉండొచ్చనే అభిప్రాయం ట్రైలర్ లో కలిగించారు. ఇవి కాకుండా ఎల్లుండి డేట్ తో డిజిటల్ లో రాబోతున్న తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం రేపు రాత్రి నుంచే అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి తెలుగు ఆడియన్స్ కి వినోదం రేపు మాములుగా ఉండటం లేదు. కావాల్సిందే టైం ఒక్కటే
Also Read : నాలుగేళ్ళ తర్వాత రేగుతున్న గాయం