iDreamPost
android-app
ios-app

పాడి రైతులకు మంచి చేస్తుంటే అడ్డంకులు.. అయినా ఆపగలరా..?

పాడి రైతులకు మంచి చేస్తుంటే అడ్డంకులు.. అయినా ఆపగలరా..?

ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల అంతిమంగా ప్రజలకు లాభమో, నష్టమో జరుగుతుంది. నష్టం జరిగే అంశాలను ప్రజలు వ్యతిరేకిస్తారు. ఉదహారణకు నూతన వ్యవసాయ చట్టాలలాంటివి. రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజా ప్రతినిధులు.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పరిధిలో తాము పోరాటడం చేయాలి. అయితే ప్రజలకు మంచి చేసే అంశాలను.. ప్రభుత్వ పెద్దలపై కక్షతోనూ లేదా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలతోనో అడ్డుకుంటే ప్రజలకు తీరని ద్రోహం చేసినవారవుతారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా.. తాము అనుకున్నదే చేస్తామంటే.. అలాంటి వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలపై వైఎస్‌ జగన్‌ రాజకీయ ప్రత్యర్థులు కోర్టులలో పిటిషన్లు దాఖలు చేస్తూ అటంకాలు కల్పించడం గత రెండేళ్లలో అనేకం జరిగాయి. ఈ పరంపరం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా.. రాష్ట్రంలోని పాడి రైతులకు మేలు జరిగేలా అమూల్‌ సంస్థతో వైఎస్‌ జగన్‌సర్కార్‌ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం అమూల్‌తో జరిగిన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో అమూల్‌కు నోటీసులు జారీ చేయాలంటూ జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

లాభాపేక్ష లేకుండా పాడిరైతులుకు మేలు జరిగేలా అమూల్‌తో ఒప్పందం చేసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం మొదట నుంచి చెబుతోంది. కోర్టుకు కూడా ఇదే చెప్పింది. రాబోయే పరిణామాలు ఎలా ఉన్నా.. తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆటంకాలు, పాడి రైతులకు నష్టం చేకూర్చేలా ఎంపీ రఘురామరాజు వ్యవహరించడం ఓ ప్రజా ప్రతినిధిగా ఆయనకు ఎంత మాత్రం శ్రేయష్కరం కాదు.

రంగం ఏదైనా ప్రైవేటుతోపాటు ప్రభుత్వం కూడా ఉంటే.. ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే ఏకఛత్రాధిపత్యం ఏర్పడుతుంది. ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి. లాభాలే లక్ష్యంగా సాగే ప్రైవేటు కంపెనీలు.. తమ లాభం కోసం సిండికేట్‌గా కూడా మారతాయి. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీలో డెయిరీ పరిశ్రమకు జీవం పోసేలా, ప్రైవేటు కంపెనీలు దొపిడీని అరికట్టేందుకు, రైతులకు గరీష్ట ధర దక్కేలా అమూల్‌ను రంగంలోకి దించారు.

ధర ఎక్కడ ఎక్కువ వస్తే.. అక్కడకు అందరూ వెళతారు. ఇదే ఫార్మలాను జగన్‌ అమలు చేస్తున్నారు. అమూల్‌ ద్వారా మార్కెట్‌ ధర కంటే నాలుగు రూపాయలు రైతులకు ఎక్కువ ధర అందిస్తున్నారు. ఫలితంగా పోటీ ఏర్పడి ప్రైవేటు కంపెనీలు కూడా ధర పెంచాయి. దీని వల్ల ప్రైవేటు కంపెనీలు సిండికేట్‌ అయ్యేందుకు వీలుండదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంపెనీ అయిన హెరిటేజ్‌ డెయిరీ రైతులకు చెల్లించే పాల ధర జిల్లాల వారీగా వేర్వేరుగా ఉంటోంది. సదురు జిల్లాలో ఉన్న పోటీని బట్టీ హెరిటేజ్‌ ధర నిర్ణయిస్తోంది. ఈ పోటీ మార్కెట్‌లోకి అమూల్‌ రావడం వల్ల ప్రైవేటు డెయిరీలు తమ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తమవుతున్నాయి. ఫలితంగా పాడి రైతులకు చెల్లించే ధర విషయంలో అమూల్‌తో పోటీ పడుతున్నాయి.

అమూల్‌ రాక ముందు హెరిటేజ్‌ ధర ప్రకాశం జిల్లాలో పది శాతం వచ్చే లీటర్‌ పాలకు 60 రూపాయలు ఇస్తోంది. అమూల్‌ వచ్చిన తర్వాత ఆ ధర 65 రూపాయలకు పెంచింది. హెరిటేజ్‌ చరిత్రలో ఒక్కసారి ఇంత మొత్తంలో ధర పెంచిన దాఖలాలు లేవు. ఇది కేవలం అమూల్‌ వల్లే సాధ్యమైందని హెరిటేజ్‌ పాల ఏజెంట్లు చెబుతున్నారు. ఒక్క హెరిటేజ్‌ మాత్రమే కాదు.. దొడ్ల, సంగం డెయిరీలు కూడా రైతులకు ఇచ్చే ధరను పెంచాయి. వీటితోపాటు స్థానికంగా ఉండే చిన్న డెయిరీలు సైతం తమ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు ధరలను పెంచడం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. రైతులకు జరిగే మేలును అడ్డుకోవాలని రఘురామరాజు వంటి రాజకీయ నేతలు యత్నించినా.. అది తాత్కాలికమే అవుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అంతిమంగా రైతులకు మేలు జరిగేలా సీఎం వైఎస్‌ జగన్‌ పని చేస్తారనడంలో సందేహం లేదు.

Also Read : ఈటెల రాజీనామా రఘురామరాజుకి కనువిప్పు కలిగిస్తుందా