iDreamPost
android-app
ios-app

దేశ మాజీ ప్రథమ పౌరుడికి కరోనా

దేశ మాజీ ప్రథమ పౌరుడికి కరోనా

కరోనా వైరస్‌ బారని పడిన ప్రముఖుల జాబితాలో దేశ మాజీ రాష్ట్ర పతి చేరారు. తనకు కరోనా సోకిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పరీక్షల్లో తనకు పాజిటివ్‌ అని తేలిందని, వారం రోజులుగా తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని 84 ఏళ్ల ప్రణబ్‌ దాదా సూచించారు.

దేశ వ్యాప్తంగా పలువరు రాజకీయ ప్రముఖులు కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. అమిత్‌షా సహా పలువరు కేంద్ర మంత్రులు, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వైరస్‌ బారిన పడ్డారు. తమిళనాడు గవర్నర్‌కు కూడా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ భారత్‌లో తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,15,074 కి చేరింది. కాగా నిన్న ఒక్కరోజే 1007 కరోనా మరణాలు సంభవించాయి..దీంతో మొత్తం మరణాల సంఖ్య 44386కి చేరింది..