Idream media
Idream media
ట్రాఫిక్ కష్టాలు, కలిగే నష్టాల గురించి మహా నగర వాసులకు తెలిసే ఉంటుంది. ట్రాఫిక్ లో ఇరుక్కుని కార్యాలయాలకు సమయానికి చేరుకోలేక చాలామంది ఇబ్బందులు పడి ఉంటారు. వాహనాల పొల్యూషన్ కు కొందరు అనారోగ్యానికి కూడా గురి అవుతారు. విషాదకర ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అంబులెన్స్ లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఒక్కోసారి రోగులకు ప్రాణాపాయం కలిగిన ఘటనలు కూడా నగరాల్లో చోటుచేసుకుంటాయి. అయితే.. ట్రాఫిక్ వల్ల చాలామందికి ఇంకో కష్టం కూడా జరుగుతోందట తెలుసా..? అనేక మంది విడాకులు తీసుకుంటున్నారట.. ఈ విషయాన్ని ఎవరో సామాన్య వ్యక్తి చెప్పలేదు. ఓ మాజీ సీఎం భార్య ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
ప్రతిపక్షంలో వాళ్లు అధికార పక్షాన్ని విమర్శించడం, అధికారపక్షం ప్రతిపక్షం వాదనలను కొట్టి పారేయడం రాజకీయాల్లో సాధారణమే. తాము అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని సమస్యల గురించి, చేయని పనుల గురించి కూడా ప్రతిపక్షంలో కూర్చున్నాక వాటి గురించి ఎదుటివాళ్లను ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.. అసలు విషయానికి వస్తే.. ముంబై ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఓ వింత వాదనను తెరపైకి తెచ్చారు.. మహిళలు విడాకులు తీసుకోవడానికి ట్రాఫిక్ కూడా ఓ కారణంగా ఆమె చెప్పుకొచ్చారు.
ముంబైలో ట్రాఫిక్ కారణంగానే మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు అమృత ఫడ్నవీస్.. తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. కానీ, నేను ఓ మహిళగా మాట్లాడుతున్న.. ఆర్థిక రాజధానిలో గుంతలు, ట్రాఫిక్‌తో తాను కూడా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు.. ట్రాఫిక్ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం కూడా తగ్గిపోవడంతో.. చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఓ వింత లాజిక్‌ను తెరపైకి తెచ్చారామె.. మరోవైపు.. నెటిజన్లు అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.. ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది.. ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే.. సోషల్ మీడియా వేదికగా ఆమె చెప్పిన లాజిక్‌పై మండిపడ్డారు.. ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ చురకలు అంటించారు. ఏదేమైనా ఓ కొత్త చర్చను లేవనెత్తారు అమృత ఫడ్ననీస్.