iDreamPost
android-app
ios-app

F3లో కామెడీతో పాటు మెసేజ్ కూడా ఉంటుంది.. సీక్రెట్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి..

  • Published May 23, 2022 | 6:58 PM Updated Updated May 23, 2022 | 6:58 PM
  • Published May 23, 2022 | 6:58 PMUpdated May 23, 2022 | 6:58 PM
F3లో కామెడీతో పాటు మెసేజ్ కూడా ఉంటుంది.. సీక్రెట్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి..

వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన భారీ కామెడీ మల్టీస్టారర్ F2 విజయం తర్వాత దానికి సీక్వెల్ గా F3 రాబోతుంది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా ఇంకా పలువురు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో F3 సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాని మే 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే పలు ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా వెళ్లి చూసి నవ్వుకునేలా F3 ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమాలో ఉన్న మరో సీక్రెట్ రివీల్ చేశాడు.

ఇప్పటివరకు ఈ సినిమాలో కామెడీ మాత్రమే ఉంది అంటూ చెప్తూ రాగా తాజాగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది. కామెడీతో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. మ‌నీ అనేది మనిషిని ఎలా మార్చేస్తుందో, దాన్ని మ‌నం ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక చిన్న మెసేజ్ రూపంలో ఈ సినిమాలో చూపించామని తెలిపారు. దీంతో సినిమాలో కామెడీనే కాక చివర్లో మెసేజ్, ఎమోషన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకొని F2 లాగే భారీ విజయం సాధిస్తుంది అంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss