Idream media
Idream media
దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి హుజురాబాద్ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ నుంచి ప్రతి టీఆర్ఎస్ కీలక నేత సీరియస్ గానే ఉన్నారు. మంత్రులు గంగుల కమలాకర్ అలాగే హరీష్ రావు హుజురాబాద్ మీద ఎక్కువగా దృష్టి సారించారు. టిఆర్ఎస్ పార్టీలో అగ్రనేత గా ఒక వెలుగు వెలిగిన ఈటెల రాజేంద్ర మీద ఎలా అయినాసరే విజయం సాధించాలని టిఆర్ఎస్ పార్టీ పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలోనే దళిత బంధు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. హుజురాబాద్ లో ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న దళిత ఓటు బ్యాంకు ను తన వైపు తిప్పుకోవడానికి సీఎం కేసీఆర్ ఈ వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఈటెల రాజేందర్ ను ఎలా అయినాసరే ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ ఎన్నిక తేదీని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారో ఏంటనే దానిపై 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో మంత్రి హరీష్ రావు కి సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించడంతో ఈటెల రాజేందర్ కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నారు. కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంతమంది కీలక నేతలు వచ్చి హుజురాబాద్ లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఈటెల రాజేంద్ర విజయం కోసం తన వంతు కృషి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోటీ ప్రధానంగా ఈటెల రాజేంద్ర వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ గానే ఉంది.
Also Read : కాకినాడ మేయర్‌పై రేపే అవిశ్వాసం.. క్యాంపులో కార్పొరేటర్లు
దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుంది ఏంటి అనే దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో… ఇటీవల ప్రచారంలో పాల్గొన్న ఈటెల రాజేంద్ర చేసిన ఒక సవాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తాను ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఒకవేళ తాను గెలిస్తే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేశారు. ఈ సవాల్ ను బండి సంజయ్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం లో ఉపయోగిస్తున్నారు.
ఈటెల రాజేంద్ర ఈ స్థాయిలో సవాల్ చేయడానికి తన విజయం పై తనకున్న నమ్మకం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక దీనికి శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈటెల రాజేంద్ర సవాల్ తర్వాత కవిత స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. హుజురాబాద్లో గెలుస్తామని చెప్తూనే ఈటెల రాజేంద్ర సవాల్ ను స్వీకరించడం లేదు అనే విషయాన్ని ఆమె పరోక్షంగా చెప్పారు.
Also Read : జనసేనకి ఉన్నది కూడా పోయింది..
హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని తెలిసిన నాటి నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రెండు వేల కోట్ల నిధులతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనిపై ఈటెల రాజేంద్ర సైతం ప్రశంసలు కురిపించారు. మరో 20 ఏళ్లపాటు ఆలోచన లేకుండా అభివృద్ధి చేస్తున్నారని దాన్ని తాను అభినందిస్తున్నానని ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అంత అభివృద్ధి జరుగుతున్నా సరే ప్రజలకు దళిత బందు వంటి కార్యక్రమాలను ప్రకటించినా సరే టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా అగ్ర నేతలు పోటీ చేస్తారని భావిస్తే గెల్లు శ్రీనివాస్ కు సీటు ఇచ్చారు. ఆయన ఇప్పటివరకు విద్యార్థి విభాగం నేత గా ఉండగా హుజురాబాద్ లో ఆయన ఎంత వరకు ఈటెల రాజేందర్ ను ఇబ్బంది పెడతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దాదాపుగా ఈటెల రాజేంద్ర నియోజకవర్గంలో పాదయాత్ర చేయటమే కాకుండా గతంలో టిఆర్ఎస్ పార్టీలో తనకు అనుకూలంగా పని చేసిన ప్రతి ఒక్కరిని తనవైపు తిప్పుకునేందుకు చేశారు అందుకే ఆయన అంత నమ్మకం గా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఎవరు గెలుస్తారో త్వరలో తేలిపోనుంది.’
Also Read : అదే జరిగితే ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుంది..?