iDreamPost
android-app
ios-app

ఈడీ 360కోట్ల పెనాల్టీ బీజేపీ కక్ష్య సాధింపంటున్నా మంత్రి గంగుల…

ఈడీ  360కోట్ల పెనాల్టీ  బీజేపీ కక్ష్య సాధింపంటున్నా మంత్రి గంగుల…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ బిజినెస్ లో అక్రమాలు జరిగాయని మంత్రి గంగులతో పాటు మరో 8కంపెనీలపై ఫైన్ విదించడం కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది.జిల్లాలో మైనింగ్ వ్యాపారిగా పేరుగాంచిన మంత్రి గంగుల కమలాకర్ మీద ఈడీ ఫెనాల్టీ వేయడం బీజేపీ కక్ష్య సాధింపని అధికార టిఆర్ఎస్ ఆరోపిస్తుండగా, అక్రమాలకు పాల్పడడంతోనే చర్యలు అని బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. జిల్లాలో మంత్రి వర్సెస్ బండి సంజయ్ అన్న విధంగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తాజగా మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మరో ఎనిమిది కంపెనీలు గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు ఈడీ రంగంలోకి దిగింది విచారణ జరిపిన ఈ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అంటూ నోటీసులు జారీ చేసింది ఈ తొమ్మిది గ్రానైట్ క్వారీలు అనుమతి పొందిన దానికన్నా ఎక్కువగా గ్రానైట్ ను ఎక్కువగా తవ్వి కృష్ణపట్నం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారని గుర్తించారు.

కరీంనగర్‌లో 9 గ్రానైట్ క్వారీలకు ఈడీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేసింది. శ్వేత ఏజెన్సీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ గ్రానైట్, మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీఏ ఎనర్జీ, అరవింద్, శాండియా ఏజెన్సీస్, పీఎస్‌ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇ కంపెనీలు గ్రానైట్ తవ్వకాలలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణకు రావడంతో అన్ని కంపెనీలకు కలిపి 2013లోనే దాదాపుగా రూ. 750 కోట్ల జరిమానా విధించారు. శ్వేత ఏజెన్సీస్‌ నుంచి రూ.4,19,49,318 నష్టం, శ్వేత గ్రానైట్స్‌ రూ.57,77,75,250, ఏఎస్‌ షిప్పింగ్‌ రూ.6,64,12,011, జేఎం బక్సీ కంపెనీ రూ.19,32,95,375, మైథిలీ ఆదిత్య రూ.33,65,83,000, కేవీకే ఎనర్జీ రూ.92,38,653, అరవింద్‌ ఏజెన్సీస్‌ రూ.94,86,290, సంధ్య ఏజెన్సీస్‌తో రూ.1,46,99,750.. కలిపి మొత్తంగా రూ.124,94,46,147 నష్టం వచ్చినట్టుగా విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. ఈ మేరకు 2013లో అప్పటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారులు.. ఆయా కంపెనీలు పాల్పడిన అక్రమాలకు ఐదు రెట్లు పెనాల్టీ కలిపి రూ.749.66,76,882 జరిమానా (సినరేజీ ఫీజు) విధించారు. కానీ ఆ కంపెనీలు జరిమానా చెల్లించకుండా.. వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చాయి.

తెలంగాణ ఏర్పడ్డాక పెనాల్టీ లను తగ్గించుకున్న కేవలం11కోట్లు మాత్రమే చెల్లించి యథేచ్ఛగా మైనింగ్ బిజినెస్ చేస్తున్నారు.

మంత్రి గంగుల కమలాకర్ కంపెనీకి360కోట్ల జరిమానా..

గ్రానైట్ అక్రమ తవ్వకాలలో మంత్రి గంగుల కమలాకర్​కు చెందిన శ్వేతా గ్రానైట్​ కంపెనీకి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ రూ.360 కోట్ల పెనాల్టీ వేసింది. ఏపీ, తమిళనాడులోని వివిధ పోర్టుల్లో ​ఫీల్డ్​ ఎంక్వైరీ చేసి, గ్రానైట్​ తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిగ్గుతేల్చింది. కరీంనగర్​ జిల్లాలో గనులశాఖ ఇచ్చిన అనుమతులకు మించి గ్రానైట్​ను తవ్వి, తరలించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 124.94 కోట్ల సీనరేజీ ఎగబెట్టిన తొమ్మిది గ్రానైట్ ఏజెన్సీలకు బుధవారం నోటీసులు ఇచ్చింది. ఈ సీనరేజీతో పాటు దానికి ఐదు రెట్లు కలిపి రూ.749.66 కోట్ల ఫైన్​ వేసింది. ఇందులో మంత్రి గంగుల కమలాకర్​కు చెందిన శ్వేత గ్రానైట్​కే ఏకంగా రూ. 360 కోట్ల పెనాల్టీ వేసింది.

బీజేపీ ఆరోపణలు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేతా కంపెనీ అక్రమ మైనింగ్ కు పాల్పడి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. మంత్రికి శ్వేతా కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలలో భాగస్వామ్యం ఉందని వీటి ద్వారా అనుమతికి మించి గ్రానైట్ తవ్వి విదేశాలకు ఎగుమతి చేసి ప్రభుత్వానికి చెల్లించాలిసిన పన్నులను ఎగ్గొట్టారని ఆరోపిస్తున్నారు.మైనింగ్ కంపెనీల అక్రమాలపై ఫిర్యాదు రావడంతో విచారించి ఫైన్ వేసింది ఈడి.అయితే ఈ పన్నులను కూడా చెల్లించకుండా.. మరో మోసానికి పాల్పడ్డారని ఈడీకి పంపిన ఫిర్యాదుల్లో కొంత మంది ఆధారాలు కూడా ఇచ్చారు. ఫిర్యాదు అందడం ఆలస్యం.. ఈడీ కరీంనగర్ గ్రానైట్ కంపెనీలపై ఫెమా చట్టం కింద విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం విధించిన పన్నుల్లో కేవలం 11కోట్లు మాత్రమే చెల్లించి మళ్ళీ గ్రానైట్ బిజినెస్ చేస్తున్నారు. దీనిపై కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2019 జూలై 31 న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అలాగే హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తదనంతరం 2019 సెప్టెంబర్ లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సాయి సౌందర్య రాజన్ కి సైతం ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

టిఆర్ఎస్ వాదన…

ఈటెల రాజేందర్ రాజీనామాతో

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ తీసుకున్నారు. ఈటల రాజీనామా చేసినప్పటి నుండి ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేశారు.ఈటెలపై డైరెక్ట్ విమర్శలు చేస్తున్నారు.ఇలాంటి సమయంలో ఈడి ఎంటర్ కావడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. టిఆర్ఎస్ ను డైరెక్ట్ గా ఎదుర్కోలేని బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీని అడ్డంపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపిస్తున్నారు. తాము చాలా ఏళ్లుగా మైనింగ్ బిజినెస్ లో ఉన్నామని ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదని గంగుల వివరణ ఇచ్చారు.

జిల్లాలో మంత్రి గంగుల కంపెనీ మైనింగ్ అక్రమ తవ్వకాలపై ఈడీ 360కోట్లు ఫైన్ వేయడం పెద్ద చర్చకు దారితీసింది. తాము సక్రమంగా వ్యాపారాలు చేస్తున్న బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు దిగుతుందని టిఆర్ఎస్ ఆరోపించగా.. బీజేపీ మాత్రం మంత్రి ప్రభుత్వం అండతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.