iDreamPost
android-app
ios-app

చిదంబ‌రంపై ఈడి ఛార్జిషీట్ దాఖ‌లు

చిదంబ‌రంపై ఈడి ఛార్జిషీట్ దాఖ‌లు

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రాన్ని, ఆయ‌న త‌న‌యుడు, కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబ‌రాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసు వెంటాడుతుంది. తండ్రి కొడుకుల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) ఛార్జీషీట్ దాఖ‌లు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం, ఆయ‌న కుమారుడు కార్తి చిదంబ‌రంపై ఈడి ఇ-ఛార్జిషీటు దాఖ‌లు చేసింది. ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన‌ట్లు ఈడి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన తొలి అభియోగ‌ప‌త్రం ఇదే. కాగా 2007లో పి.చింద‌బరం కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌లోకి విదేశీ పెట్టుబ‌డులు భారీగా త‌ర‌లివెళ్ల‌డానికి స‌హ‌క‌రించార‌ని ఆరోప‌ణ‌ల‌తో ఈ కేసు మొద‌లైంది. దాని నుంచి కార్తి చిదంబ‌రం ల‌బ్ధి పొందార‌ని సిబిఐ, ఈడి ఆరోపిస్తూ కేసులు న‌మోదు చేశాయి. పెట్టుబ‌డుల త‌ర‌లింపులో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో మోడీ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ 2017 మే 15లో సిబిఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. దానిలో దానిలో చిదంబ‌రం పేరును కూడా చేర్చింది. మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌తో ఆ మ‌రుస‌టి ఏడాది ఆయ‌న‌పై ఈడి కేసు న‌మోదు చేసింది.

ఐఎన్ఎక్స్ మీడియాకు చెందిన ఇంద్రాణీ ముఖ‌ర్జియా, పీట‌ర్ ముఖ‌ర్జియాలు కూడా ఈ కేసులో స‌హ నిందితులుగా ఉన్నారు. త‌రువాత ఇంద్రాణీ అఫ్రూవ‌ర్‌గా మారారు. ఇదే కేసులో పి.చిదంబరాన్ని2019 ఆగ‌స్టు 20 రాత్రి ఢిల్లీలో సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ను కారులో సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. 2019 సెప్టెంబ‌ర్ 5న తీహార్ జైల్‌కు త‌ర‌లించారు. తిరిగి 106 రోజుల త‌రువాత 2019 డిసెంబ‌ర్ 4 బెయిల్‌పై చిదంబ‌రం విడుద‌ల అయ్యారు. అయితే ఈ ప‌రిణామాల‌పై చిదంబ‌రంస్పందిస్తూ ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనపై ఏ నేరాభియోగమూ లేదని చెప్పారు. ఈ కేసులో తన కుటుంబంలో ఎవరిపైనా నేరాభియోగం లేదని ఆయన అన్నారు. ఈడిగాని, సిబిఐగాని కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయలేదన్నారు.