Idream media
Idream media
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. సుమారు 35సెకన్లు వరకు భూమి కంపించినట్లు తెలుస్తోంది.
నల్గొండ, సూర్యాపేట, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతంలోని చిలుకూరు, మునగాల, అనంతగిరి, నడిగూడెం సహా పలు గ్రామాల్లో భూమిలో ప్రకంపనలు వచ్చాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల, రావిరాలలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సాధారణమేనని జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. వీటివల్ల ఎలాంటి ప్రమాదం జరగదని తెలుపుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.