iDreamPost
iDreamPost
2017లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం గుర్తుందిగా. కమర్షియల్ గా సేఫ్ అయ్యింది కానీ మరీ సరైనోడు, ఆర్య రేంజ్ లో ఆడిన బ్లాక్ బస్టర్ అయితే కాదు. అప్పట్లో దీని కలెక్షన్ల మీద రివ్యూల మీద రేగిన దుమారానికి దర్శకుడు హరీష్ శంకర్ స్టేజి మీదే ఘాటుగా స్పందించడం గుర్తే. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడని బన్నీ మీద నిరసనతో డీజే ట్రైలర్ కి యుట్యూబ్ లో డిస్ లైక్స్ వర్షం కురిసింది కూడా ఈ సందర్భంలోనే. బాక్సాఫీస్ ఫలితం గురించి పక్కనపెడితే హీరోయిన్ పూజా హెగ్డేకి పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమాగా డీజేని తన అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా గ్లామర్ షో ఓ రేంజ్ లో రచ్చ చేసింది.
ఇప్పుడీ డీజే ని హిందీలో రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. తెలుగు వెర్షన్ తీసిన దిల్ రాజునే నిర్మాతగా వ్యవహరిస్తూ బాలీవుడ్ లో ఓ యూత్ స్టార్ హీరోతో తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. అతనెవరు అనేది మాత్రం బయటికి రాలేదు. హరీష్ శంకర్ దిల్ రాజు ఇటీవలే ఏటిఎం అనే వెబ్ సిరీస్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. వీళిద్దరి బాండింగ్ రామయ్య వస్తావయ్యా నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు పార్ట్ నర్స్ గా కూడా మారారు. ఐదేళ్ల తర్వాత ఉన్నట్టుండి ఇప్పుడు డీజే రీమేక్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న సందేహం కలగడం సహజం. దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో మన సౌత్ లో వచ్చిన మాస్ సినిమాలు హిందీలో తెగ ఆడేస్తున్నాయి. పుష్ప ఓటిటిలో వచ్చాక కూడా నార్త్ ఆడియన్స్ థియేటర్లలో చూస్తూనే ఉన్నారు. ఎటొచ్చి తెలుగులోనే అది బాగా స్లో అయ్యింది. డీజే ఆల్రెడీ యుట్యూబ్ లోనే 450 మిలియన్ల వ్యూస్ తో గోల్డ్ మైన్స్ యుట్యూబ్ ఛానల్ కి బంగారు బాతులా కాసులు కురిపించింది. అంత చూసినా కూడా ఇప్పుడీ రీమేక్ కి రెడీ కావడం సాహసమే. అల్లు అర్జున్ చేసే ఛాన్స్ లేదు కానీ కొన్ని కీలకమైన మార్పులతో మెయిన్ పాయింట్ ని అలాగే ఉంచేసి హరీష్ శంకర్ కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. భవదీయుడు భగత్ సింగ్ ఆలస్యమైతే ఇది మొదలుపెట్టొచ్చు
Also Read : Ram : ఐకాన్ స్టార్ స్థానంలో ఇస్మార్ట్ హీరోతో సినిమా ?