iDreamPost
iDreamPost
ఇటీవల ఎండలు బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రానున్న కాలంలో ఎండలు మరింత పెరుగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. భూమి మీద పెరిగే ఈ వేడికి ఏకంగా మంచుకొండలు కరుగుతున్నాయి. వాటిలో మన హిమాలయాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఉన్న ఎండలకు ఉత్తర పాకిస్థాన్ లో ఉన్న షిష్పర్ గ్లేసియర్ హిమాలయాలు కరిగి ఆ నీరంతా హస్నాబాద్ వద్ద ఉన్న నదిలోకి వరద ప్రవాహంగా వెళ్తుంది.
దీంతో ఆ వరదల వల్ల చుట్టుపక్కల గ్రామాలు మునుగుతున్నాయి. అయితే ఉత్తర పాకిస్థాన్, చైనాని కలిపే ఓ వంతెన కారాకోరం హైవేపై ఈ నది మీదే ఉంది. ఈ హిమాలయాలు కరిగి ఏర్పడిన వరదల ఉధృతికి తట్టుకోలేక ఆ వంతెన కుప్ప కూలిపోయింది. ఈ వంతెన ధ్వసమవడంతో ఉత్తర పాకిస్తాన్ మరియు చైనాల మధ్య రవాణా సంబంధం తెగిపోయింది. వరద ధాటికి ఆ వంతెన కూలిపోయే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వరదల వల్ల హస్నాబాద్ లోని రెండు పవర్ ప్లాంట్స్ కూడా కొట్టుకుపోయాయి. దీంతో పాకిస్తాన్ అధికారులు అప్రమత్తమై ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలని ఎత్తైన ప్రదేశాలకి తరలిస్తున్నారు. ఆ వంతెన మీదుగా వెళ్లాల్సిన వాహనాల్ని కారకోరం హైవే మీద నుండి సాస్ వ్యాలీ రోడ్‌కి మళ్లిస్తున్నారు.
మే 2019లోనే NASA ఈ షిష్పర్ గ్లేసియర్ హిమాలయాల గురించి ప్రస్తావించి భవిష్యత్తులో ఇవి కరిగిపోతాయి. వీటి వరదల వల్ల కారకోరం హైవే, హసనాబాద్ లోని గృహాలు, పవర్ ప్లాంట్లు కొట్టుకుపోతాయని తెలిపింది. అయితే పాకిస్థాన్ దీనిపై ముందస్తు చర్యలు తీసుకోలేదు. గత 20 రోజులుగా ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హిమాలయాల్లో కూడా దాదాపు 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో అవి కరిగిపోతున్నాయి.
బ్రిడ్జి కూలిన ఘటనపై పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ మాట్లాడుతూ.. 48 గంటల్లో తాత్కాలిక వంతెనను నిర్మిస్తాము. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని తరలిస్తున్నాము. ఉష్ణోగ్రతలు పెరగడంతో హిమాలయాలు కరుగుతున్నాయి అని తెలిపారు.
Heatwave triggered Glacial Lake Outburst Flood (GLOF) in Gilgit Baltistan destroying agricultural land, the Hassan Abad bridge & sweeping houses along. Pakistan meteorological department forecasts more GLOF events in the norther areas particularly in Chitral. #ClimateChange pic.twitter.com/O56NHKCMI7
— Iftikhar Firdous (@IftikharFirdous) May 7, 2022
This is #climatechange.
The main bridge connecting Pakistan and China got washed away yesterday due to the outburst of Shishper glacier. Extreme heat in the region is provoking fast glaciers melting and the floods are destroying houses and land.pic.twitter.com/2nMBJJWyHk
— Mariana Castaño Cano 💚 (@Mariana_Castano) May 8, 2022