iDreamPost
android-app
ios-app

టీఆర్‌ఎస్‌ – బీజేపీ.. నువ్వా.. నేనా..

టీఆర్‌ఎస్‌ – బీజేపీ.. నువ్వా.. నేనా..

తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఉప ఎన్నిక తుది ఫలితం ఎలా ఉన్న ప్రస్తుతం కౌంటింగ్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. రౌండ్ల వారీగా రెండు పార్టీలు ఆధిక్యం సాధిస్తూ సత్తా చాటుతున్నాయి.

మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించి 3,020 ఓట్ల మెజారిటీని పొందగా.. ఆరు, ఏడు రౌండ్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఆరో రౌండ్‌లో 353, ఏడో రౌండ్‌లో 182 ఓట్ల మెజారిటీని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత సాధించారు. ఎనిమిదో రౌండ్‌లో మళ్లీ బీజేపీ ముందంజలో నిలిచింది. ఈ రౌండ్‌లో కమలం పార్టీ 621 ఓట్ల మెజారిటీ సాధించింది. దీంతో మరోసారి బీజేపీ ఆ«ధిక్యం మూడు వేల మార్క్‌ను దాటింది.

23 రౌండ్లకుగాను 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. బీజేపీ 3,106 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉంది. మొత్తం 1,64,192 ఓట్లకు గాను ఇప్పటి వరకూ లెక్కించిన ఓట్లలో.. బీజేపీకి 25,878 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 22,772, కాంగ్రెస్‌కు 5,125 ఓట్లు వచ్చాయి. ఇంకా 15 రౌండ్లలో దాదాపు 1.08 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలను బట్టీ తుది ఫలితంపై ఎవరూ స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు.