iDreamPost
android-app
ios-app

టీడీపీ కి తలవంపులు, వారి శవరాజకీయాలకు షాక్ ఇచ్చిన డాక్టర్ సుధాకర్ కుటుంబం

టీడీపీ కి తలవంపులు, వారి శవరాజకీయాలకు షాక్ ఇచ్చిన డాక్టర్ సుధాకర్ కుటుంబం

టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు తనయుడు చేసిన పనులన్నీ టీడీపీకి తలవంపులు తెస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మార్లు అతని వల్ల ఆపార్టీకి భంగపాటు తప్పలేదు. తాజాగా మరోసారి శవరాజకీయాలు కూడా బెడిసికొట్టాయి. విశాఖలోని డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని అడ్డంపెట్టుకుని నడపాలనుకున్న వ్యవహారం తలకిందులయ్యింది. నారా లోకేష్ తలందించుకునే పరిస్థితి వచ్చింది. స్వయంగా ఆయన ఎదురుగానే డాక్టర్ సుధాకర్ తల్లి సీఎం జగన్ ని దేవుడు అంటూ ప్రస్తుతించడంతో నారా లోకేష్ కి మొఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ఆయనేమో ప్రభుత్వ హత్యగా చిత్రీకరించాలని యత్నిస్తుంటే ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని, గుండెపోటుతో తమ కొడుకు చనిపోతే ప్రభుత్వానికి ముడిపెట్టడం భావ్యం కాదని ఆ తల్లి చెప్పడం టీడీపీ నేతలకు మింగుడుపడని పరిస్థితి తీసుకొచ్చింది. అది కూడా లోకేష్ ఎదురుగా మీడియాతో చెప్పడంతో ఏం మాట్లాడో తెలియని టీడీపీ బృందం అక్కడి జారుకోవాల్సి వచ్చింది.

రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా దానిని జగన్ కి ముడిపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని టీడీపీ యత్నిస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. మంచి జరిగితే జగన్ కి సంబంధం లేదన్నట్టుగా, చెడు సంఘటనలన్నీ ఆయన ఖాతాలో వేసేయాలనే దురుద్దేశంతో ఓ వర్గం మీడియా కొండంత రాగం తీయడం, దానిని చంద్రబాబు, ఆయన తనయుడు అందుకోవడం రెండేళ్లుగా ఆనవాయితీగా మారింది. దానికి అనుగుణంగానే అనేక విషయాల్లో వ్యక్తిగత అంశాలను కూడా ముడిపెట్టి ముఖ్యమంత్రి మీద రాళ్లేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణిస్తే దానిని కూడా వాడేసుకోవాలని చూసింది. చివరకు అభాసుపాలయ్యింది.

వాస్తవానికి డాక్టర్ సుధాకర్ జీవించి ఉండగానే తన తప్పిదాన్ని గ్రహించారు. టీడీపీ నాయకుల ప్రోద్భలంతో తాను నిబంధనలను ఉల్లంఘించిన వాస్తవాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం తనకు మళ్లీ అవకాశం ఇస్తే విధుల్లో చేరతానని, జగన్ ని కొనియాడుతూ పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటి సుధాకర్ అనుకోని పరిస్థితల్లో గుండెపోటు కారణంగా మరణిస్తే దానిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూడడం టీడీపీ మార్క్ వ్యవహారంగా చెప్పవచ్చు. చివరకు సొంత పార్టీకి సేవ చేసిన నేతలు ఎందరో మరణిస్తే కనీసం చివరి చూపు కాదు కదా ఆయా కుటుంబాలను కన్నెత్తి చూడడానికి సిద్దపడని లోకేష్ హుటాహుటీన విశాఖలో వాలిపోయారు. అయినప్పటికీ సుధాకర్ కుటుంబం మాత్రం జగన్ పట్ల పల్లెత్తుమాట అనడానికి నిరాకరించడమే కాకుండా, జగన్ మంచి వాడు అంటూ కొనియాడి లోకేష్ అండ్ కో కి షాకిచ్చారు.

ప్రజలను భ్రమల్లో పెట్టి లబ్ది పొందాలనే ఆలోచన లోకేష్ మానుకోవడం మంచిది. డాక్టర్ సుధాకర్ లాంటి కుటుంబాలతో రాజకీయాలు చేయాలనుకోవడం ఆపేస్తే శ్రేయస్కరం. ఎందుకంటే అన్నింటినీ తమ ప్రయోజనాలకు మలచుకోవాలని ఆశిస్తే ఆఖరికి లోకేష్ సమక్షంలోనే జగన్ ని మెచ్చుకుంటూ టీడీపీ గాలి తీసేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవడం ఆపార్టీకి మంచిది.