తండ్రి, కొడుకుల గాలి తీసేసిన డాక్టర్

అధికారంలో ఉన్నపుడు కేవలం వారసత్వం హోదాతో మాత్రమే పదవులు అందుకున్న నారావారి పుత్రరత్న లోకేష్ అజ్ఞానం తాజాగా మనోసారి బయటపడింది. ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి ఏదో ఓ రూపంలో జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలతో జనాలను ఆకట్టుకునేందుకు ట్విట్టర్ ను వేదికగా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. తాజాగా ఇటువంటి ప్రయత్నమే మరోటి చేసి నవ్వుల పాలయ్యారు. లోకేష్ ఎవరికైతే మద్దతుగా ట్వీట్ పెట్టాడో అదే డాక్టర్ సుధాకర్ తాను తప్పు చేశానని ఒప్పేసుకోవటం.

ఇంతకీ విషయం ఏమిటంటే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మాస్కులు తదితరాలు లేకపోవటంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ విషయంపైనే చంద్రబాబు, చినబాబు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. డాక్టర్ ను సస్పెండ్ చేయటాన్ని తప్పు పట్టారు. చివరకు లోకేష్ అయితే దళిత డాక్టర్ ను సస్పెండ్ చేయటమేంటని కులాన్ని కూడా వివాదంలోకి లాగేశాడు.

సరే వీళ్ళ ఆరోపణలను పక్కన పెట్టేస్తే తాను తప్పు చేసినట్లు స్వయంగా డాక్టరే ఒప్పేసుకున్నారు. ప్రభుత్వం మీద బహిరంగంగా అరోపణలు చేసి ఉండకూడదంటూ డాక్టర్ తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. అంటే చేసిన తప్పును డాక్టర్ ఒప్పేసుకోవటంతో తండ్రి, కొడుకులకు గాలి తీసేసినట్లయ్యింది. ఏరియా ఆసుపత్రికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఛైర్మన్ గా పనిచేశాడు కాబట్టే తాను ఆయన్ను కలిసినట్లు ఒప్పేసుకున్నాడు. పైగా డాక్టర్ చేసిన ఆరోపణలన్నీ తప్పే అని విచారణలో తేలింది. అవసరానికి సరిపడా మాస్కులు, గ్లౌజులు అన్నీ ఉన్నాయి. అయితే రిజిస్టర్ లో సంతకం చేసి వాటిని తీసుకోవటాన్ని అవమానంగా భావించిన డాక్టర్ వాటిని తీసుకోకుండా పెద్ద సీన్ క్రియేట్ చేశాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డాక్టర్ ను ముందుపెట్టి రాజకీయం చేద్దామనుకున్న టిడిపి నేతల చవకబారు రాజకీయాలు చాలా తొందరగానే బయటపడోయింది. దాంతో దళిత కార్డును తెరపైకి తెచ్చాడు. ఇదే డాక్టర్ చంద్రబాబునాయుడు హయాంలో ఇటువంటివే ఆరోపణలు చేసుంటే కచ్చితంగా సస్పెండ్ చేసుండే వారే అనటంలో సందేహం లేదు. ఇక దళిత కార్డును తెరపైకి తెచ్చిన లోకేష్ రాజ్యసభ ఎంపిల నామినేషన్ సందర్భంగా గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా దళితుడైన వర్ల రామయ్యతో నామినేషన్ వేయించి అవమానించిన విషయాన్ని మరచిపోయాడేమో ?

Show comments