iDreamPost
android-app
ios-app

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపై డ్రోన్ కలకలం! అసలేం జరిగింది?

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపై డ్రోన్ కలకలం! అసలేం జరిగింది?

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులకు, కేంద్ర మంత్రులకు భారీ బందోబస్తు ఉంటుంది. వారి ప్రాణాలకు ఎటువంటి హానీ జరగకుండా పోలీసు శాఖ భద్రత చర్యలు తీసుకుంటుంది. అలానే ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసి వారి విషయంలో భద్రత సిబ్బంది చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటుంది. అలానే  వీఐపీ నివాస స్థలాల్లో అనుమానిత వస్తువులు ఎగిరినా, వాహనాలు ఆగిన భద్రత సిబ్బంది వెంటనే అల్టెర్ అవుతారు. వీరికి ఈ స్థాయిలో ఉంటే.. ఇక దేశ ప్రధానికి  ఏ స్థాయిలో భద్రత వ్యవస్థ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చీమ చిట్టుకుమన్న భద్రత సిబ్బంది అలెర్ట్ అవుతోంది.  అలాంటి ప్రధాని నివాసంపై డ్రోన్ కలకలం రేపింది.

ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నివాసంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేగుతోంది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఓ డ్రోన్ ప్రధాని నివాసం మీదుగా ఎగురుతుండటం అక్కడి ప్రత్యేక భద్రతా విభాగం అధికారులు గుర్తించారు. న్లో ఫ్లైయింగ్ జోన్‌లో డ్రోన్‌ ఎగిరినట్టు ఢిల్లీ పోలీసులకు ప్రధాని భద్రతా విభాగం అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. రంగంలోకి దిగి.. డ్రోన్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ ఆ డ్రోన్‌ జాడను పోలీసులు గుర్తించలేదని సమాచారం. అసలు ఇంటిపై ఎగిరింది డ్రోనేనా అనే డౌట్ కూడా ఉంది. ప్రధాని నివాసం నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్‌లోకి వస్తుందనే విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎంతో భద్రత ఉన్న ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగరడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. డ్రోన్ ఎగిరిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిలోనే ఉన్నారు. ఈ ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్రోన్ ఎగరేసింది ఎవరు? ఎందుకు ఎగరేశారు? ప్రధాని మోదీ భద్రతకు సమస్య ఉందా? దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాలను ఇప్పుడు భద్రతా సిబ్బందితో పాటూ.. ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీకి ప్రత్యేక భద్రత విభాగం నిరంతరం భద్రత కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ అధికారులే డ్రోన్‌ ను  గుర్తించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.