iDreamPost
android-app
ios-app

OTT Movies: ఖైదీ కోసం పోలీస్ సాహసం! OTTలో ఈ బెస్ట్ మూవీ ఎలా మిస్ అయ్యారు?

  • Published Apr 17, 2024 | 7:53 PM Updated Updated Apr 26, 2024 | 6:23 PM

ఓటీటీ లో ఉండే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. కానీ అవేంటో తెలిస్తే మాత్రం ఎలా మిస్ చేశామా అని ఫీల్ అవుతూ ఉంటారు మూవీ లవర్స్. ఈ సినిమాను కనుక మీరు మిస్ చేసి ఉంటే ఏ ప్లాట్ ఫార్మ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లో ఉండే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. కానీ అవేంటో తెలిస్తే మాత్రం ఎలా మిస్ చేశామా అని ఫీల్ అవుతూ ఉంటారు మూవీ లవర్స్. ఈ సినిమాను కనుక మీరు మిస్ చేసి ఉంటే ఏ ప్లాట్ ఫార్మ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Apr 17, 2024 | 7:53 PMUpdated Apr 26, 2024 | 6:23 PM
OTT Movies: ఖైదీ కోసం పోలీస్ సాహసం! OTTలో ఈ బెస్ట్ మూవీ ఎలా మిస్ అయ్యారు?

ఓటీటీ లో సినిమాలాంటే అందరు ఎంతో ఆశక్తి కనబరిచినా కానీ, కొన్ని సినిమాలు మాత్రం మిస్ అయిపోతూ ఉంటారు, ట్రైలర్ చూసి కొన్ని మిస్ చేస్తే.. టీజర్ మాత్రమే చూసి మరికొన్ని మిస్ చేసేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడైనా ఆ సినిమాల గురించి బజ్ వినిపిస్తే.. అప్పుడు ఈ సినిమానా మనం మిస్ చేసాం అని ఫీల్ అవుతూ ఉంటారు మూవీ ప్రియులు. ఇతర భాషల సినిమాలైతే పర్లేదు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సినిమాని మిస్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి థ్రిల్లర్ సినిమాను మిస్ చేసినట్లే. అదే “రైటర్” సినిమా. ఈ మూవీని చూడడం మీరు మిస్ చేస్తే కనుక.. ఏ ప్లాట్ ఫార్మ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో.. ఎందుకు ఈ సినిమాను చూడాలి అనే విషయాల గురించి చూసేద్దాం.

రైటర్ అనే ఈ సినిమా ను 2021 లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకత్వం వహించారు. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ చిత్రానికి 7.7 రేటింగ్ వచ్చింది. సముథ్రఖని ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా .. ఆహ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రైటర్ సినిమా కథ విషయానికొస్తే.. సిన్సియర్ గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ .. తన పై అధికారుల ఒత్తిడి కారణంగా ఒక అమాయకపు అబ్బాయిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా అతను చదువుకుంటున్న ఒక కాలేజ్ స్టూడెంట్ .. ఈ క్రమంలో అతనిని ఎలాగైనా సేవ్ చేయాలనీ అనుకుంటాడు ఈ పోలీస్ ఆఫీసర్. అసలు అన్యాయంగా అతనిని ఒక అక్రమ కేస్ లో అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంటుంది ! అది కూడా ఈ రైటర్ చేతనే ఎందుకు అరెస్ట్ చేయిస్తారు ! అతనిని సేవ్ చేయడానికి ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు ! చివరకు ఆ తప్పుడు కేస్ నుంచి.. ఆ అబ్బాయిని తప్పిస్తాడా లేదా ! ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మిస్టరీ థ్రిల్లర్ చూడాల్సిందే.

సస్పెన్స్ తో పాటు ఈ సినిమాలో ఉండే ఎమోషనల్ సీన్స్ కూడా అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అందరిని కదిలించేస్తుందని చెప్పి తీరాలి. ఈ సినిమా ఒరిజినల్ గా తమిళ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నా కూడా… ఆహ లో మాత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. పోలీసులు చెందించే మిస్టరీ కేసులకు సంబంధించిన సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. కానీ, ఈ మూవీలో ప్రతి సీన్ కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం.. ఖచ్చితంగా వెంటనే చూసేయండి. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.