Swetha
Best Suspense Thriller In OTT: కొన్ని సినిమాలు చూస్తే అర్రే ఇన్ని రోజులు ఇలాంటి సినిమాలు ఎలా మిస్ అయ్యామా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. మరి ఈ సినిమాను చూశారో లేదో చెక్ చేసేయండి.
Best Suspense Thriller In OTT: కొన్ని సినిమాలు చూస్తే అర్రే ఇన్ని రోజులు ఇలాంటి సినిమాలు ఎలా మిస్ అయ్యామా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. మరి ఈ సినిమాను చూశారో లేదో చెక్ చేసేయండి.
Swetha
సినిమాలంటే కేవలం మనకు తెలిసిన దక్షిణ భాషల్లోనే కాకుండా.. కొరియన్, ఫ్రెంచ్, స్పానిష్ ఇలా అనేక భాషల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మూవీ లవర్స్ అంతా కూడా అన్ని భాషల చిత్రాలను బాగానే ఆదరిస్తున్నారు. ముఖ్యంగా కొరియన్ సిరీస్ ను అందరు మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు . అయితే కొరియన్ కథలంటే అందరూ లవ్, రొమాన్స్ జోనర్స్ ఏ ఉంటాయి అనుకుంటారు కానీ, ఇందులో కూడా మంచి హర్రర్ థ్రిల్లర్స్, వెన్నులో వణుకు పుట్టించే కథలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ కంటెంట్ సినిమాలను చూసే ప్రేక్షకులకు.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఓ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ కొరియన్ సినిమా కథ విషయానికొస్తే. ఈ సినిమాలో హీరో తన గతాన్ని మర్చిపోతాడు. కానీ అతని వలన గతంలో రెండు కుటుంబాలు నాశనం అయిపోతాయి. అసలు కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో జిన్ అనే యువకుడి ఫ్యామిలీ అంతా కలిసి ఓ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. అయితే అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి జిన్ కు రకరకాల శబ్దాలు వినిపించడం, వింత వింత కలలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే జిన్ అన్నయ్య ఓ యాక్సిడెంట్ కారణంగా సరిగా నడవలేకపోతాడు. అయితే ఓ రోజు ఈ అన్నదమ్ములు ఇద్దరు బయటకు వచ్చినపుడు.. జిన్ అన్నయ్యను ఎవరో కిడ్నప్ చేస్తారు. ఆ విషయాన్నీ జిన్ వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతాడు. ఇక ఆ తర్వాత నుంచి అక్కడ ఊహించని ట్విస్ట్ లు ఎదురౌతాయి.
ఆ ఇంట్లో జరుగుతున్న వింతలను చూడలేక జిన్ ఆ ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అప్పుడు అనుకోకుండా ఓ పోలీస్ వ్యాన్ కు డాష్ ఇస్తాడు, పోలీసులు వివరాలను అడిగినపుడు తనకు 20 ఏళ్ళని, తాము 1997 లో ఉన్నామని అతను చెప్తాడు. కానీ, అక్కడే అసలు కథ మొదలవుతుంది, ఎందుకంటే జిన్ వయస్సు 20 కాదు, 40 అలాగే వారు ఉన్నది 2017 వ సంవత్సరంలో. పైగా తాను గతంలో రెండు హత్యలను కూడా చేశాడట. ఆ హత్యలు జిన్ చేసాడని పోలీసులకు తెలిసినా కూడా.. అతనికి గతం గుర్తులేకపోడంతో అతనిని మాత్రం ఏమి చేయలేకపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ! ఇదంతా తెలిసిన జిన్ ఎం చేస్తాడు ! తనకు గతం గుర్తొస్తుందా! అసలు ఆ హత్యలు ఎందుకు చేశాడు! ఇవన్నీ తెలియాలంటే “ఫర్గాటెన్“ అనే సినిమాను చూడాల్సిందే.
ట్విస్ట్ ల మధ్యలో సినిమా ఉందా సినిమా మధ్యలో సినిమా ఉందా అనేంత ఇంట్రెస్టింగ్ గా సినిమాలు తీయాలంటే మాత్రం.. అది కేవలం కొరియన్ వాళ్ళకే సాధ్యం అని ఈ సినిమాతో నిరూపించారు. పైగా ఈ సినిమాలో థ్రిల్లర్ కంటెంట్ మాత్రమే కాకుండాఏ థ్రిల్లర్ తో పాటు .. ఎమోషనల్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేసి.. ప్రేక్షకులకు ఓ మంచి ఎక్స్పీరియెన్స్ ను అందించారు. ఖచ్చితంగా ఇది ఓ వర్త్ వాచింగ్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.