iDreamPost
android-app
ios-app

“చంద్ర”దండు రాష్ట్ర అధ్యక్షుడుపై వేదింపుల కేసు

  • Published Jun 30, 2020 | 8:42 AM Updated Updated Jun 30, 2020 | 8:42 AM
“చంద్ర”దండు రాష్ట్ర అధ్యక్షుడుపై వేదింపుల కేసు

అనంతపురానికి చెందిన తెలుగుదేశం నేత చంద్రబాబు ముఖ్య అనుచరుడు చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయుడిపై వేదింపుల కేసు నమోదయింది. ప్రకాష్ నాయుడు తనను రోజూ వేధిస్తూ మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు అంటూ ఆయన భార్య పోలీసులని ఆశ్రయించడంతో ఆమె ఫిర్యాదు మేరకు అనంతపురం ఫోర్తు టౌన్ పోలీసులు ఆయనపై 498 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

2004లో చంద్రదండును ఏర్పాటు చేసిన ప్రకాష్ నాయుడు వ్యవహారం తొలి నుండి వివాదాస్పదమే. చంద్రబాబుకి అనుచరుడిగా ఆయన పాదయాత్రలో ఒక టీం ను ఏర్పాటు చేసి కీలకం గా వ్యవహరించడంతో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రకాష్ నాయుడుకి ఏపీ మాంసం ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌ అంటూ ఒక కొత్త కార్పొరేషను చంద్రబాబు సృష్టించి చైర్మన్‌గా కీలక పదవిని అతనికి కట్టబెట్టి లబ్ది చేకూర్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఆయన ఆ పధవికి రాజీనామా చేశారు.

2016లో యాడికిలో ప్రతిపక్షనేత గా జగన్ నిర్వహిస్తున్న రైతుభరోసా యాత్రను అడ్డుకునేందుకు చంద్రదండు సభ్యులతో వచ్చి తీవ్ర ప్రయత్నం చేశారు, ఇటీవల నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు నేరుగా కార్యాలయంలో ఉన్న టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌లోకి చొచ్చుకుపోయి అధికారి టీపీఓ వినయ్‌ప్రసాద్‌పై దుర్భాషలాడుతు బేదిరింపులకి దిగడంతో అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన నెలకే ఇప్పుడు ప్రకాశ్ నాయిడు పై ఆయన భార్యే వేదింపుల కేసు పెట్టడంతో ప్రకాష్ నాయుడు వివాదాస్పద వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశం అయింది.