Idream media
Idream media
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అటు తమిళనాడులోనూ, ఇటు దక్షిణ భారతంలోనూ ఈ చర్చ మరింత విస్తృతంగా జరుగుతుంది. అయితే రాజకీయ ప్రవేశం ఇంకా జరగలేదు. ఆయన అభిమానులు మాత్రం రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అదేవిధంగా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని పదే పదే చెబుతున్నారు. కాగా నటుడు రజినీ కాంత్ కూడా ఇటీవల తన ప్రజా సంఘం నిర్వాహకులతో భేటీ అవ్వడం ఆ తర్వాత మీడియా ముందుకు రావడం వంటి సంఘటనలు జరిగాయి.
అయితే మీడియాతో కూడా తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజల కూడా రజనీ వైఖరి ఏమిటన్నది అర్థం కాని పరిస్థితి.
ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మాత్రం నటుడిగా వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సన్ ఫిక్చర్స్ నిర్మిస్తున్న ఆన్నాత్తా చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలంటూ నిర్మాణ సంస్థ మొదట్లోనే ప్రకటించింది. అయితే కరోనా కారణంగా అన్నాత్త చిత్ర విడుదల వాయిదా పడక తప్పలేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. కాగా నటుడు రజినీకాంత్ తాజాగా మరో మూడు చిత్రాలను చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
అందులో ఒక చిత్రాన్ని లారెన్స్ దర్శకత్వంలో చేయనున్నటుసమాచారం. అదేవిధంగా కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించనున్న భారీ చిత్రంలో నటించనున్నారనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయింది. అయితే ఆ తర్వాత రజనీకాంత్ వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే ప్రముఖ దర్శకుడు శంకర్‌తో కలిసి మరో చిత్రం చేయడా నికి రజనీకాంత్ సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ పూర్తిగా రాజకీయ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాల గురించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇకపోతే రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో చేసే చిత్రం తర్వాత నటనకు స్వస్తి చెప్పనున్నారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా ప్రస్తుతం రజనీకాంత్ వయస్సు (69). ఆయన కొత్తగా ఒప్పుకున్న చిత్రాల సమాచారం నిజమైతే మరో మూడేళ్ల వరకు నటనకే పరిమితమవుతారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆయన ఇప్పటి వరకు తన రాజకీయ పార్టీ పేరునే ప్రకటించలేదు. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.
ఇప్పటికే రజనీకాంత్ సహచర నటుడు కమల్ హసన్ తమిళ్ మక్కల్ నిథి పార్టీ పెట్టారు. అయితే ఆయన అడపాదడపా ప్రకటనలు ఇస్తున్నారే తప్ప క్రియాశీలకంగా రాజకీయాల్లో పనిచేయటం లేదు. రజనీకాంత్ గతంలో బిజెపికి అనుబంధంగా ఉన్నారనే వార్తాలు వచ్చాయి. అయితే ఆయన కొత్త పార్టీ పెడతారా..? బిజెపితో కలిసి వెళ్తారా..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
గతంలో రజనీకాంత్ కొత్తగా పార్టీ పెడతారని తమిళనాడులో చర్చ జరిగినప్పుడు…కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు. ఆయన కర్ణాటకకు చెందిన వ్యక్తి అని…ఆయన ఇక్కడ రాజకీయాలు చేయడమేంటని ఆందోళనలు జరిగాయి. దీనికి రజనీకాంత్ స్పందిస్తూ నేను తమిళ వ్యక్తినేనని, ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నానని తెలపాల్సి వచ్చింది. అంతేకాదు తనను ఆదరించిన తమిళనాడుకు, తమిళ ప్రజలకు తాను రుణపడి ఉంటానని తెలిపారు. దయచేసి ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టొద్దని సూచించారు.
అయితే ఆందోళనల నేపథ్యంలో పార్టీ పెడతారా చర్చకు రజనీకాంత్ కాంత్ పుల్ స్టాప్ పెట్టారు. తన అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అప్పటి నుంచి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? అనే చర్చ జరుగుతుంది. రెండు, మూడు సందర్భాల్లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పొగడటంతో వార్తాల్లో నిలిచారు. అలాగే వివాదాస్పద అంశాలపై కూడా స్పందిస్తూ వివిధ సందర్భాల్లో రజనీకాంత్ వార్తాల్లోకి ఎక్కారు.