P Krishna
Meaning of Numbers on Train Bogies: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. రైల్వే ప్రయాణం తక్కువ ఖర్చు మాత్రమే కాదు.. అన్ని సౌకర్యాలతో పాటు సురక్షితం అని భావిస్తుంటారు.
Meaning of Numbers on Train Bogies: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. రైల్వే ప్రయాణం తక్కువ ఖర్చు మాత్రమే కాదు.. అన్ని సౌకర్యాలతో పాటు సురక్షితం అని భావిస్తుంటారు.
P Krishna
దేశంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. రైలు ప్రయాణం సురక్షితమే కాదు.. ఎంతో రక్షణగా ఉంటుంది. భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణాలు చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రైలు ప్రయాణం ఎంచుకుంటారు. బస్ కన్నా తక్కువ ధర.. అన్ని రకాల వసతులు రైల్లో ఉంటాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు ఇలా ఎంతో మంది నిత్యం ట్రైన్ ప్రయాణాలు చేస్తుంటారు.రైలు ప్రయాణం చేయడమే కాదు.. రైలు గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే మంచింది. కంపార్ట్ మెంట్ పై రైల్వే శాఖ 5 అంకెల నంబర్ ను రాసి ఉంచుతారు..దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ మనకు పలు ట్రైన్లపై నెమ్ బోర్డులు, గుర్తులు, నెంబర్లు కనిపిస్తుంటాయి. కానీ వాటిని మనం అస్సులు పట్టించుకోం.. రైల్లో వెళ్లినా పట్టించుకోం. అయితే వాటిని అంత సింపుల్ గా తీసుకోవొద్దు.. వాటి వెనుక చాలా అర్థాలు ఉంటాయి. ప్రతి రైల్ కంపార్ట్‌మెంట్ శాఖ 5 అంకెల నెంబర్‌ని రాసి ఉంచడం గమనించారా? ఆ నెంబర్ల వెనుక పెద్ద కథే ఉంది. రైలు లోని ప్రతి బోగీ పై ఐదు నెంబర్లు రాసి ఉంటాయి.. దాని అర్థం ఏంటంటే? ఆ బోగీని ఎప్పుడు నిర్మించారు, ఇది ఏ రకమైన బోగీ అనే సమాచారం ఉంటుంది. మొదటి రెండు అంకెటు ఈ రైలు బోగీ ఎప్పుడు నిర్మించారో తెలియజేస్తుంది. చివరి మూడు అంకెలు దాని వర్గాన్ని తెలియజేస్తాయి.
ఉదాహారణకు రైలు బోగీ పై 21337 అని నెంబర్ రాసి ఉందని అనుకుందాం. ఈ నంబర్ లో మొదటి 2 నెంబర్లు అంటే 21 ఉంటే ఆ బోగీ తయారైన సంవత్సరం అంటే 2021 లో ఆ బోగీ తయారు చేశారని అర్థం. మిగతా మూడు నెంబర్ల అంటే 337 ఉంటే అది ఏ రకమైన బోగీ అని తెలియజేస్తుంది. అంటే స్వీపర్ క్లాస్ బోగీనా, జనరల్ బోగీనా లేదా ఏసీ బోగినా అనే విషయాన్ని తెలియజేస్తుంది. 001 నుంచి 025 వరకు ఉన్న సంఖ్యలు ఏసీ ఫస్ట్ క్లాస్ ని సూచిస్తాయి. 101 నుంచి 150 సంఖ్యలు ఉన్న నెంబర్ల 150 సంఖ్యలు ఏసీ 3 టైర్లను సూచిస్తాయి. 151 నుంచి 200 సంఖ్యలు ఉంటే.. కార్ చైన్ లను సూచిస్తాయి. స్లీపర్ క్లాస్ కు 201 నుంచి 400 నంబర్లు. 401 నుంచి 600 సంఖ్యలు ఉన్న నెంబర్లు సాధారణ కోచ్ లను సూచిస్తాయి. 601 నుంచి 700 సంఖ్య ఉంటే సెకండ్ క్లాస్ కోచ్ గా సూచిస్తుంది. కోచ్ చివరి మూడు సంఖ్యలు 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. అది మెయిల్, జనరేటర్ లేదా ప్యాంట్రీ బోగీ అని అర్థం. మరి ఈ నెంబర్లు గుర్తు పెట్టుకొని బోగీ ఏ సంవత్సరంలో తయారు చేశారో తెలుసుకోవచ్చు. అలాగే ఏ తరగతికి చెందినదో సులభంగా తెలుసుకోవచ్చు.