iDreamPost
android-app
ios-app

సీటు బెల్టు పెట్టుకోలేదు.. ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోలేదు.. ఎమ్మెల్యే కుమారుడు దుర్మరణం

సీటు బెల్టు పెట్టుకోలేదు.. ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోలేదు.. ఎమ్మెల్యే కుమారుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం మూలంగానే జరుగుతుంటాయి. ఆ నిర్లక్ష్యం మూల్యం నిండు ప్రాణాలు. అతి వేగం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం.. ఇలాంటి విషయాలను విస్మరిస్తుండడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బెంగుళూరులోని కోరమంగళ్‌మార్స్‌ కళ్యాణమండపం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే వై.ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్, కోడలు బిందుతో సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

అతి వేగంతో వారు ప్రయాణిస్తున్నకారు డివైడర్‌ను ఢీ కొట్టి ఓ భవనంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆడి లగ్జరీ కారు నుజ్జునుజ్జయింది. స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణ సమయంలో కరుణసాగర్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారు. వెనుక ముగ్గురుచొప్పన కూర్చున్నారు. కరుణసాగర్‌ తో సహా ఎవరూ సీటు బెల్ట్‌ ధరించలేదు. వాహనం డివైడర్‌ను ఢీ కొట్టిన సమయంలోనూ, భవనంలోకి దూసుకెళ్లినప్పుడు కూడా ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోలేదు.

ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని పోలీసులు గుర్తించారు. కారుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని నిర్థారణకు వచ్చారు. ప్రమాదం అర్థరాత్రి 1:30 గంట సమయంలో జరిగింది. వారు మద్యం సేవించారా..? లేదా..? అన్నది పోస్టుమార్టంలో తేలాల్సి ఉంది. కరుణ సాగర్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. అతని భార్య బిందు, స్నేహితులు ఇషిత, ధనుష, అక్షయ గోయల్, ఉత్సవ్, రోహిత్‌లు కారులో ప్రయాణిస్తున్నారు. సీటు బెల్టు పెట్టుకోని ఉన్నా వారందరి ప్రాణాలు దక్కేవి.

Also Read : కోరి చిక్కులు తెచ్చుకున్న కూన రవికుమార్‌