iDreamPost
android-app
ios-app

మొత్తానికి టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్వవాణి

మొత్తానికి టీడీపీకి గుడ్ బై చెప్పిన దివ్వవాణి

టీడీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. మహానాడు తరువాత పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చిందని శ్రేణులు అనుకుంటున్న తరుణంలో తెదేపా అధికార ప్రతినిధిగా ఉన్న దివ్యవాణి రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది.

దివ్యవాణి ముందుగా తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కానీ, ఏ కారణం చేతనో ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. తాజాగా రెండోసారి ఆమె తన రాజీనామా అంశంపై స్పష్టతనిచ్చారు.

ఇటీవలి కాలంలో టీడీపీలో బాగా ఉత్సాహంగా కనిపించారు దివ్వవాణి. అవకాశం వచ్చిన ప్రతిసారి మైకు ముందు తన గళాన్ని వినిపించారు. కొన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

కానీ, మహానాడులోని కొన్ని సంఘటనలతో ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కూడా రాజీనామాకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు ప్రాధాన్యత లేకపోవడమే అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది.

టీడీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ, దానిపై ఎలాంటి లేఖ బయటకు రాలేదు. తెదేపాలో కొన్ని దుష్టశక్తులు ఉన్నట్లుగా చెప్పుకొచ్చిన దివ్యవాణి, ఆ శక్తులకు వ్యతిరేకంగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom