విజ‌యన‌గ‌రం రాజ‌కీయాల‌పై టీడీపీలో క‌ల‌వ‌ర‌పాటు

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు ముక్క‌లుకావ‌డంపై పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ముందుకు గొయ్యి.. వెనుక నుయ్యిగా మారింది. ఇటువంటి ప‌రిస్థితిలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న విజ‌య‌న‌గ‌రంలో విభేదాలు బ‌హిరంగం కావ‌డంపై క‌ల‌క‌లానికి గురి చేస్తోంది. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడుతో చ‌ర్చించి స‌మ‌స్య కొలిక్కిరావాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం వెళ్ళిన అచ్చెన్నాయుడు అసంతృప్తితో ఉన్న మీసాల గీత తో పాటు ఇత‌ర నేత‌ల‌తో కూడా అచ్చెన్నాయుడు మాట్లాడారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య కొలిక్కిరాలేదు.

కార్యాల‌యం తీసివేత‌కు వారు స‌సేమిరా అన్న‌ట్లు తెలుస్తోంది. పైగా జిల్లాలో రాచరిక పెత్తనానికి చరమగీతం పాడాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్న మ‌రికొంద‌రు నేత‌లు కూడా గీత‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామాల‌న్నీ విజ‌య‌న‌గ‌రంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆధిప‌త్యానికి చెక్ పెట్టేలా క‌నిపిస్తున్నాయి. జిల్లాలో ఆధిప‌త్య పోరు రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌పై కూడా ప్ర‌భావం చూపుతుండ‌డంతో పార్టీ అధినేత‌కు కంటి మీద కునుకు లేకుండా పోతుంద‌ని ఆ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

అశోక్ శ‌కం ముగిసిన‌ట్లేనా..?

జిల్లాలో గంటా శ్రీనివాసరావు పెత్తనం మొదలైన తరువాత మీసాలగీత, గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కె.ఎ.నాయు డు వంటి వారు గంటా పంచన చేరారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. ఈ విషయాన్ని అధినేత వద్ద చూపించుకుని గత ఎన్నికల్లో మీసాల గీతకు పార్టీ టిక్కెట్టు రాకుండా చేశా రు అశోక్‌. ఆమె స్థానంలో తన కుమార్తె అదితి గజపతిని పార్టీ తరఫున ఎన్నికల బరిలో దింపారు. బీసీ మహిళకు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్న టిక్కెట్టుతో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు నిలవలేక, కుమార్తెను గెలిపించుకోలేక, ఎంపీగా తానూ విజయం సాధించలేక ఘోర పరాజ యం పాలయ్యారు. ఈ క్ర‌మంలో..  అశోక్‌కుగానీ, విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న అదితి జగపతికి గానీ, విజయనగరం పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్‌గా ఇటీవలే నియమితులైన కిమిడి నాగార్జునకుగానీ చెప్పకుండా, వారిని ఆహ్వానించకుండా స్వతంత్రంగా నిర్ణ యం తీసుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారంటే దీనివెనుక భారీ వ్యూహాలే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నా యి.

మరోవైపు ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఇంతవరకూ స్పందించలేదంటే పార్టీలో తన స్థానం, ప్రాధాన్యం ఏమిటో అర్ధం చేసుకుంటున్న అశోక్‌ భవిష్యత్‌పై ఆలోచనలో పడ్డారనేది బంగ్లా వేగుల మాట. ఏది ఏమైనా జిల్లాలో ఏమీ లేని టీడీపీ ఇప్పుడు ఇలా రెండు ముక్కలవ్వడం పార్టీ నేత లు తమ వర్గాలను బహిర్గతం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం ఏర్పా టు చేయలేక స్థలపరిశీలనకే పరిమితమైన మీసాల గీత ఇ ప్పుడు కొత్త కుంపటి పెట్టుకుని మాత్రం సాధించేదేముంద ని అశోక్‌ వర్గం అంటుంటే, జిల్లా టీడీపీలో అశోక్‌గజపతి శ కం ముగింపునకు చేరినట్టేనని గీత వర్గం ప్రచారం చేస్తోంది.

Show comments