Venkateswarlu
Venkateswarlu
240 కోట్ల రూపాయల సీమెన్స్ స్కాంకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. చంద్రబాబు నాయుడ్ని శనివారం ఉదయం నంద్యాలలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబును హజరుపర్చటం కోసం నంద్యాలనుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్కాంలో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అచ్చెన్నాయుడు ఎక్కడ?..
సీమెన్స్ స్కాం జరిగిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ కార్మికశాఖ పరిధిలోకి వస్తుంది. ఈ స్కాం జరిగినపుడు అచ్చెన్నాయుడు ఏపీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ స్కాంలో చంద్రబాబునాయుడితో పాటు అచ్చెన్నాయుడి పాత్ర కూడా ఉన్నట్లు ఏపీ సీఐడీ నిర్థారించింది. ఈ మేరకు కేసులో అచ్చెన్నాయుడ్ని ఏ2గా చేర్చింది. ఏ1 అయిన చంద్రబాబు, కేసుతో సంబంధం ఉన్న గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడ్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
అచ్చెన్నాయుడికి అరెస్ట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. శ్రీకాకుళంలో ఉన్న ఆయన ఇంటి దగ్గర పోలీసుల అలికిడి కూడా కనిపించడం లేదు. ఇంతకీ అచ్చెన్నాయుడు ఇంటి దగ్గర ఉన్నారా? లేదా? ఒక వేళ ఉంటే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు?.. ఏ2గా ఉన్న ఆయన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చన్నది నిర్వివాదాంశం. కానీ, ఎప్పుడు అన్నదే అంతుచిక్కుకుండా ఉంది. అరెస్టుల నేపథ్యంలో అచ్చెన్నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం కూడా నడుస్తోంది. మరి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సీమెన్స్ స్కాంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్.. ఏపీ సీఐడీ నెక్ట్స్ ఏం చేయబోతోంది?