iDreamPost
android-app
ios-app

బాలయ్య బాబుతో జత కట్టిన ఖిలాడీ భామ.. తమన్ మాస్ బీట్‌కు స్టెప్పులు..

  • Published May 18, 2022 | 6:43 PM Updated Updated May 18, 2022 | 6:44 PM
  • Published May 18, 2022 | 6:43 PMUpdated May 18, 2022 | 6:44 PM
బాలయ్య బాబుతో జత కట్టిన ఖిలాడీ భామ.. తమన్ మాస్ బీట్‌కు స్టెప్పులు..

బాలకృష్ణ ‘అఖండ’ సినిమా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్, అన్ స్టాపబుల్ షో లాంటి సూపర్ హిట్ ప్రోగ్రాం చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే సిరిసిల్లలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.

రామోజీ ఫిలిం సిటీలో మాస్ బీట్ స్పెషల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తమన్ మ్యూజిక్ లో స్వరపరచిన ఓ మాస్ స్పెషల్ సాంగ్ ని రామోజీ ఫిలింసిటీలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో షూట్ చేస్తున్నారు. ఈ పాటలో ఖిలాడీ భామ డింపుల్ హయతి బాలయ్యతో కలిసి స్టెప్పులేయబోతున్నట్టు తెలుస్తుంది.

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లి బాలయ్య బాబు, శేఖర్ మాస్టర్, గోపీచంద్ మలినేనితో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశాడు. అఖండకి థియేటర్ బాక్సులు బద్దలైపోయే సూపర్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఈ సినిమాకి ఇస్తుండటంతో అభిమానులు సినిమాపై ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ నటిస్తున్నాడు. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş