వారసుడు వేడుక కోసం పవర్ ఫుల్ ప్లాన్

ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తన వెర్షన్ చెప్పుకున్నారు కానీ మొత్తం స్క్రీన్ కౌంట్ బయటికి వస్తే కానీ ఏది న్యాయం ఏది అన్యాయం అర్థం కాదు.

ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తన వెర్షన్ చెప్పుకున్నారు కానీ మొత్తం స్క్రీన్ కౌంట్ బయటికి వస్తే కానీ ఏది న్యాయం ఏది అన్యాయం అర్థం కాదు.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను తట్టుకోవడం డబ్బింగ్ సినిమా వారసుడుకి అంత సులభంగా లేదు. నిర్మాత దిల్ రాజు ఏపీ తెలంగాణలో భారీ రిలీజ్ కు ప్లాన్ చేయడం పట్ల ఇప్పటికే ఫిలిం ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఎదురుకుంటున్నారు. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తన వెర్షన్ చెప్పుకున్నారు కానీ మొత్తం స్క్రీన్ కౌంట్ బయటికి వస్తే కానీ ఏది న్యాయం ఏది అన్యాయం అర్థం కాదు. దీని సంగతలా ఉంచితే త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. తమిళనాడులో చెన్నై వేదికగా చేస్తారు కాబట్టి అక్కడ ఏ సమస్యా లేదు. విజయ్ స్వయంగా హాజరై ఫ్యాన్స్ కి కావాల్సిన ఉత్సాహాన్ని, నిర్మాత కోరుకున్న హైప్ ని పెంచేస్తాడు

ఎటొచ్చి తెలుగులో జరిగే వేడుకకు వస్తాడానేది ఆసక్తికరంగా మారింది. గతంలో బీస్ట్, మాస్టర్, అదిరింది లాంటివి రిలీజైనప్పుడు అతను రాకపోయినా ప్రొడ్యూసర్లు ఎలాగో మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వారసుడుకి ప్రస్తుతానికి ఇక్కడేం భీభత్సమైన హైప్ లేదు. ట్రైలర్ వచ్చాక పెరగొచ్చేమో కానీ ఎంత జరిగినా చిరంజీవి బాలకృష్ణలకు సమానంగా విజయ్ హైప్ తీసుకురాలేడు. అలాంటప్పుడు ఏదైనా మాస్టర్ స్కెచ్ అవసరం. అందులో భాగంగానే చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. కానీ ఇదంత సులభం కాదు. పవన్ మాములు బిజీగా లేడు. హరిహరవీరమల్లు షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది

పైగా అన్నయ్య వాల్తేరు వీరయ్యను కాదని అపోజిషన్ లో ఉన్న వారసుడుకి మద్దతు తెలపడం అనుమానాలే. లేదూ ఈ లెక్కలన్నీ వేసుకోకుండా వస్తారా అనేది వేచి చూడాలి. దిల్ రాజు నిర్మాతగా పవన్ వకీల్ సాబ్ చేసిన సంగతి తెలిసిందే. తను వచ్చినా రాకపోయినా వారసుడు ఈవెంట్ చేయడం మాత్రం చాలా అవసరం. విజయ్ రాకుండా పోలేడు. పైగా ఇంత పెద్ద స్థాయిలో తనకు రిలీజ్ ప్లాన్ చేసిన దిల్ రాజు కోసం హైదరాబాద్ వస్తాడు. కాకపోతే పవన్ రాలేని నిస్సహాయత వ్యక్తం చేస్తే ఆ ప్లేస్ లో ఎవరు వస్తారనేది చూడాలి. రాజుగారు అడగాలే కానీ వచ్చేవాళ్లకు కొదవలేదు కానీ ఎప్పుడు ఏ ఎక్కడ ఏ స్థాయిలో చేస్తారో చూడాలి మరి

Show comments