iDreamPost
android-app
ios-app

Balakrishna : NBK 109 కోసం డిఫరెంట్ కాంబినేషన్

  • Published Jan 24, 2022 | 11:08 AM Updated Updated Jan 24, 2022 | 11:08 AM
Balakrishna : NBK 109 కోసం డిఫరెంట్ కాంబినేషన్

వరస డిజాస్టర్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఆనందం అంతా ఇంతా కాదు. థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుని ఓటిటిలోకి వచ్చాక కూడా టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారిన అఖండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే రీతిలో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. నిన్నా మొన్నటి దాకా రెస్టు లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న బాలయ్య శుక్రవారం ఏకంగా సుదర్శన్ థియేటర్ కు వచ్చి మరీ అభిమానులతో టైం గడిపారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయలు వసూలు చేయడం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. నరసింహనాయుడు తర్వాత అక్కడ సింగల్ స్క్రీన్లో ఈ ఫీట్ సాధించడం సాధ్యపడలేదు.

దీని సంగతలా ఉంచితే అఖండ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనిల్ రావిపూడిది ఉంటుంది. ఇవి అయ్యాక 109వ సినిమా మొదలుపెట్టాలి. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండొచ్చని లేటెస్ట్ అప్ డేట్. ఆహాలో అన్ స్టాపబుల్ షో నుంచి అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరైన బాలయ్య ఆ సంస్థకో మూవీ చేస్తానని మాటిచ్చారట. కళ్యాణ్ రామ్ తో బింబిసార చేసిన దర్శకుడు వశిస్ట్ మల్లిడి చెప్పిన లైన్ ఒకటి బాగా నచ్చడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిసింది. బాలయ్య ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేనిది ఇంకా కన్ఫర్మ్ కాలేదు

ఇంతేకాదు స్టోరీ లైన్ కు సంబంధించిన లీక్ కూడా వచ్చింది. రిటైర్మెంట్ కు ఆరు నెలల సర్వీస్ దూరంలో ఉన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథగా దీన్ని ప్రెజెంట్ చేయబోతున్నట్టు వినికిడి. ఖాకీ దుస్తుల్లో బాలకృష్ణ చాలా సినిమాలు చేశారు. ఇన్స్ పెక్టర్ ప్రతాప్, భలే తమ్ముడు, రౌడీ ఇన్స్ పెక్టర్, లక్ష్మి నరసింహ, రూలర్ ఇలా సరిసమానంగా హిట్లు ఫ్లాపులు ఉన్నాయి. అయితే పోలీస్ దుస్తుల్లో బాలయ్య ఫెయిలైన సందర్భాలు తక్కువ. మరి ఇంకా ప్రూవ్ కానీ వశిస్ట్ గీత సంస్థలో జెండా నాటాడంటే సబ్జెక్టు ఏదో పవర్ ఫుల్ గా ఉన్నట్టే అనిపిస్తోంది. ఇదంతా బింబిసార ఫలితం, అందులో టేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి

Also Read : Bheemla Nayak : పవన్ సినిమాకు పెద్ద కోత ?

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş