Idream media
Idream media
తెలంగాణా రాజకీయాల్లో ఏదో తేడా కొడుతుంది మాస్టారూ… సరిగా చూడండి అన్నీ విచిత్రంగా జరుగుతున్నాయి మరి. భూమి పూజ కోసం అని ఢిల్లీ వెళ్ళిన కేసీర్ … రిటర్న్ ఫ్లైట్ ఎక్కి రావడానికి వారం పట్టింది. అక్కడి వరకు వెళ్ళారు కాబట్టి ప్రధానిని, కేంద్ర మంత్రులను అప్పుడోకరిని అప్పుడోకరిని కలిసారు. ఎందుకు కలిసారో చెప్తూ ప్రభుత్వ వర్గాలు మీడియాకు కొంత సమాచారం ఇచ్చాయి. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో వాటిని వారం రోజుల నుంచి అటు ఇటు తిప్పుతున్నారు.
ఈ తరుణంలో ఒక తెలంగాణా ప్రాంత పత్రిక సంచలన కథనం రాసింది. వచ్చే ఎన్నికల కోసం ప్లాన్ వేసారు.. కేంద్రంలో మీరు… రాష్ట్రంలో మేము అని కేసీఆర్ చెప్పారని సీట్ల ఒప్పందాలు జరిగాయని రాజీ కుదిరిందని ఆ పత్రిక రాసింది. అది మరువక ముందే సంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ ఒక సభలో మాట్లాడుతూ తెరాస ఎమ్మెల్యేలు, బిజెపిలోకి వస్తున్నారనే నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి అందుకనే వెళ్లి కాళ్ళు పట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు అంటూ ఆరోపణలు చేసారు.
ఆ తర్వాత దాన్ని మరికొందరు బిజెపి నేతలు హైలెట్ చేస్తూ కామెంట్స్ ఘాటుగా చేసారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుంది రక్త పరిక్షలు కూడా చేస్తామని చెప్పేశారు. ఆ మాట కాస్త షేక్ చేసింది. అవినీతి ని బయట పెట్టి కచ్చితంగా అరెస్ట్ చేస్తామని అన్నారు. ఈ కామెంట్స్ ఇలా వినపడుతూనే ఉన్నాయి… ఢిల్లీ వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి కొన్ని మాటలు మాటలు మాట్లాడారు. నెంబర్ 1 బకరా బండి సంజయ్ అయితే… నెంబర్ 2 ఈటెల రాజేంద్ర అన్నారు.
నడిచీ నడిచీ బండి కాళ్ళు అరగడమే గాని ఉపయోగం లేదని కామెంట్ చేసేసారు. ఆ పైన కామెంట్స్ ఏమో గాని రేవంత్ కామెంట్స్ మాత్రం బిజెపి నేతలను బాధ పెట్టాయని సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చెప్తున్నాయి. ఇక్కడ రేవంత్ కు ప్రాధాన్యత ఇవ్వడం కాదు గాని… ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే… కేసీఆర్ ఢిల్లీ టూర్, బండి సంజయ్ పాదయాత్రకు లింక్ మాత్రం కచ్చితంగా పెట్టొచ్చు. ప్రభుత్వాన్ని పడగొడతా అంటూ… ఎండా వానా అనకుండా నడుస్తున్న తరుణంలో…
భూమి పూజ పేరుతో ఢిల్లీ వెళ్ళిన పెద్దాయన… వారం రోజుల పాటు అక్కడ ఉండి విపక్షాలను కలవకుండా కేంద్ర పెద్దల చుట్టూ తిరగడం చూస్తే ఆ డౌట్ అందరికి వస్తుంది. ఈయన తిట్టే పని మీద ఉంటే అక్కడ కారుకి ఏ ప్రమాదం రాకుండా ఉండటానికి ఆయన బోకేలు ఇచ్చే పని మీద ఉన్నారు. ఇక్కడ ఈయన తిడితే ఆయన అక్కడ దండం పెట్టగానే ఇద్దరూ కలిసిపోయారనే అభిప్రాయం ప్రజల్లో కలగదా…? అప్పుడు బండి సంజయ్ యాత్ర వృధా ప్రయాసే అనే అభిప్రాయం అందరిలోనూ కలగదా…? బిజెపి నేతల
మాటలకు విలువ ఏం ఉంటుంది…?
బండి సంజయ్ నానా తిట్లూ తిడుతున్నా… కాంగ్రెస్ ని తిడుతున్నారు గాని బండి సంజయ్ కు సమాధానం చెప్పట్లేదు తెరాస నేతలు. బిజెపి… తెరాస ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే… హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఈటెల రాజేంద్ర మీద ఆ ప్రభావం పడితే… ఏంటి పరిస్థితి…? ఇద్దరూ ఒకటే అనే విధంగా ఇలాగే పరిస్థితి ఉంటె… మరో పార్టీని పైకి రానీయకుండా ఉండటానికి ఈటెలను కావాలనే బిజెపిలోకి పంపారనే అభిప్రాయం ప్రజల్లో కలగదా…? ఈ ఇద్దరూ ఒకటి అని జనం అనుకుంటే… లాభం తెలంగాణా ఇచ్చిన పార్టీకే కదా…? కేసీఆర్ ఢిల్లీ టూర్ తో ఒక్కటే అర్ధమైంది… పాదయాత్రతో మేము బలపడతాం… మిమ్మల్ని కాపాడతాం అన్నట్టే ఉంది మరీ… ఫైనల్ గా కేసీఆర్ నష్టపోయేది ఏం ఉండదు… ఢిల్లీలో చలిలో బాధపడటం తప్పించి.